Saturday, November 23, 2024

నవీ ఫిన్‌సర్వ్‌ ఎన్‌సీడీ.. రూ.600 కోట్ల బేస్‌ ఇష్యూ : సచిన్‌ బన్సల్‌..

న్యూఢిల్లి : నవీ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ భాగస్వామ్య సంస్థ అయిన నవీ ఫిన్‌సర్వ్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎఫ్‌ఎస్‌) మంగళవారం రూ.600 కోట్ల బేస్‌ ఇష్యూతో సురక్షిత, రేటెడ్‌, లిస్టెడ్‌ అండ్‌ రీడీమబుల్‌ నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌ (ఎన్‌సీడీలు) పబ్లిక్‌ ఇష్యూను ప్రకటించింది. బేస్‌ ఇష్యూ రూ.300 కోట్లు, ఓవర్‌ సబ్‌ స్క్రిప్షన్‌ రూ.300 కోట్లు ఉండనుంది. ఈ ఇష్యూ.. మే 23, సోమవారం తెరవబడుతుందని, జూన్‌ 10, 2022 లేదా అంతకంటే ముందే మూసివేయబడుతుందని ఎన్‌ఎఫ్‌ఎస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అంకిత్‌ అగర్వాల్‌ తెలిపారు.

ప్రతిపాదిత ఎన్‌సీడీలు ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా ఏ (స్టేబుల్‌) రేటింగ్ను కలిగి ఉన్నాయి. ఈ రేటింగ్‌ ఆర్థిక బాధ్యతలను సకాలంలో అందించడానికి సంబంధించి తగిన స్థాయిలో భద్రతను కలిగి ఉన్నట్టు పరిగణించబడుతుందన్నారు. ఎన్‌ఎఫ్‌ఎస్‌ సీఈఓ, చైర్మన్‌ సచిన్‌ బన్సల్‌ మాట్లాడుతూ.. తక్కువ క్రెడిట్‌ రిస్క్‌ను కలిగి ఉంటాయన్నారు. పెట్టుబడిదారులు.. తమ పెట్టుబడిపై 9.8 శాతం వరకు రిటర్న్స్‌ పొందే అవకాశాలున్నాయని వివరించారు. 18 నెలలు.. 27 నెలల కాల వ్యవధిలో వివిధ సిరీస్‌ల కింద ఎన్‌సీడీలో పాల్గొనొచ్చని తెలిపారు. కనిష్ట అప్లికేషన్‌ సైజ్‌ రూ.10,000గా ఉంటుందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement