Friday, November 22, 2024

కూట‌మిల‌కు దూరం – ఒంట‌రిగానే పోరాటం… ఒడిశా సిఎం న‌వీన్ పట్నాయిక్

న్యూఢిల్లి : తృతీయ కూటమిలో లేదా బీజేపీయేతర పార్టీల కు చెందిన ఒక ఉమ్మడి రాజకీయ వేదికలో తాను చేరడంలేద ని ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్‌(బీజేడీ) పార్టీ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లికి, లోక్‌సభకు జరిగే ఎన్నిక ల్లో బీజేడీ ఒంటరిగా పోటీ చేస్తుందని తెలిపారు. ప్రధానితో భేటీ అయిన సందర్భంగా ఎలాంటి రాజకీయ అంశాలు చర్చకు రాలేదని చెప్పారు. మోడీతో భేటీపై మాట్లాడుతూ ”మా చర్చ ప్రధానంగా ఒడిశా అంశాలపై జరిగింది. పూరీలో ప్రతిపాదిత జగన్నాథ అంతర్జాతీయ విమానాశ్రయం గురిం చి ప్రధానితో మాట్లాడాను. దానికి సంబంధించిన సరిహద్దు లను ఇప్పటికే రూపొందించాం. విపరీతమైన ట్రాఫిక్‌ను చవిచూస్తున్న భువనేశ్వర్‌ విమానాశ్ర య విస్తరణ చేపట్టాలని నేను కోరాను. తనకు సాధ్యమైనం తలో కచ్చితంగా సాయం చేస్తానని ప్రధాని హామీ ఇచ్చారు” అని ఒడిశా సీఎం తెలిపారు.

తన ఢిల్లి పర్యటనలో భాగంగా ఇతర రాజకీయ పార్టీల నేతలతో భేటీ కాలేదని చెప్పారు. బీహార్‌ సీఎం, జేడీ(యూ) నేత నితీశ్‌ కుమార్‌ తనను భువనేశ్వ ర్‌లో కలిసిన 2 రోజులకే తృతీయ కూటమిలో చేరడం లేదంటూ బీజేడీ అధినేత తేల్చి చెప్పడం అత్యంత ప్రాధాన్యత ను సంతరించుకుంది. 2009 లో బీజేడీ- బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం బీటలు వారినప్పటి నుంచి నవీన్‌ పట్నాయక్‌ నేతృత్వంలోని బీజేడీ పార్టీ బీజేపీ, కాంగ్రెస్‌తో సమదూరం పాటిస్తూ వస్తున్నది. అంతేకాకుండా ఆ పార్టీ జాతీయ రాజకీయాల పట్ల అంతగా ఆసక్తి చూపించదు. వాటి లో పాలుపంచుకోదు. ఒడిశా, ఒడిశా ప్రజల ప్రయోజనా లపైన మాత్రమే తాను ఎప్పుడూ దృష్టిపెడు తుంటానని బీజేడీ చెబుతుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement