Friday, November 22, 2024

కనువిందు చేస్తున్న ప్రకృతి ‘రాఖీ’ పుష్పాలు

భూపాలపల్లి : అన్న – చెల్లెలు, అక్క-తమ్ముళ్ల అనుబంధాలకి, ప్రేమానురాగాలకు, మమతలకు ప్రాకారం, ఆప్యాయానికి నిలువెత్తు రూపంగా రక్షాబంధన్ నిలుస్తుంది. ధనిక, పేద , చిన్న, పెద్ద తేడా లేకుండా తమ తమ స్తోమత, స్థాయిని బట్టి కాగితం నుండి బంగారంతో చేయించిన రాఖీలను అక్క, చెల్లెలు తమ సోదరులకు కట్టి తమ ఆప్యాయతను అనురాగాలను పంచుకుంటారు. అయితే ప్రకృతి కూడా తాను ఏ మాత్రం తీసిపోను అన్నట్టుగా ఈ సీజన్ లో రాఖీ పూల రూపంలో చూపరులకు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుంది. జయశంకర్ భూపాలపల్లి లోని కుందూర్ పల్లి కొలపాక రవి మంజుల ఇంటి ముందు రాఖీ పువ్వులు విరభూసి చూపరులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement