యోగా రోజూ చేయడం అలవాటుగా మార్చకుంటే విజయాలన్నీ చేకూరతాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన యోగా డేలో ఆయన హాజరై ప్రసంగించారు. ప్రధాని మోదీ వల్ల యోగాకు దేశ విదేశాల్లో ప్రాధాన్యత సంతరించుకుందని వెల్లడించారు. యోగా అంటే శరీరాన్ని, మనసును కలిపే ప్రక్రియ అని అభివర్ణించారు. ప్రాణులు ప్రకృతితో మమేకమవ్వడమే యోగా అంతరార్థమని చెప్పారు. ఇవాళ ప్రపంచమంతా యోగా జపం చేస్తుందన్నారు. కులమతాలకు అతీతంగా అందరూ నేర్చుకోవాల్సిన విద్య ఇదేనని తెలిపారు.
- Advertisement -