Friday, November 22, 2024

నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ పట్టం..

అర్ ఆర్ ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ కు ప్రతిష్టాత్మక అస్కార్ అవార్డు లభించింది.. ఈ అవార్డును సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి , గీత రచయిత చంద్ర బోస్ లు క్అందుకున్నారు.. అస్కార్ అవార్డు అందుకున్న తొలి భారతీయ చిత్రంగా ట్రిపుల్ అర్ చరిత్ర సృష్టించింది.. చంద్ర బోస్ రాసిన ఈ గీతాన్ని కాల బైరవ, సిపిగంజ్ ఆలపించారు.. ప్రేమ రక్షిత్ కొరియోగ్రఫీ అందిచారు..

ఆర్.ఆర్.ఆర్. చరిత్ర సృష్టించింది. ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ‘నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అకాడమీ అవార్డ్ వచ్చింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం సుమారు 8.30 గంటల సమయం లో ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో ఈ అవార్డు ఈ పాటకి ఇస్తున్నట్టుగా ఆస్కార్ వేదిక మీద ప్రకటించారు. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా దర్శకుడు రాజమౌళి కాగా, ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. చంద్రబోస్ ఈ ‘నాటు నాటు’ పాటని రాశారు. ఈ పాటని రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు. ప్రేమ్ రక్షిత్ ఈ పాటకి కోరియోగ్రఫీ చేశారు. ఇలా తెలుగు పాట ఆస్కార్ నామినేషన్స్ లో ఉండటం, ఆస్కార్ గెలుచుకోవటం ఇదే మొదటి సారి. ఇప్పుడు ఈ పాట చరిత్ర సృష్టించింది

Advertisement

తాజా వార్తలు

Advertisement