విజ్ఞాన్ భవన్‌లో జరిగిన నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే – 2024 సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ఆరు జాతీయ ఇంధన సంరక్షణ అవార్డులను అందుకుంది.
కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలోని ‘బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ’ నిర్వహించిన కార్యక్రమంలో… కేంద్ర మంత్రి శ్రీపాద్ వై.నాయక్ ఈ అవార్డులను అందజేశారు. దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ బ్రిజ్ మోహన్ మీనా, రైల్వే చీఫ్ ఎలక్ట్రికల్ జనరల్ ఇంజనీర్ విష్ణుకాంత్, గుంతకల్ డివిజనల్ రైల్వే మేనేజర్ విజయ్ కుమార్ ఈ అవార్డులు అందుకున్నారు.
⦁హాస్పిటల్స్ విభాగంలో గుంతకల్ డివిజనల్ రైల్వే ఆసుపత్రికి ప్రథమ బహుమతి.
⦁రైల్వేస్టేషన్ల విభాగంలో రేణిగుంట రైల్వేస్టేషన్‌కు ప్రథమ బహుమతి.
⦁రైల్వేస్టేషన్ల విభాగంలో జమ్మికుంట రైల్వేస్టేషన్‌కు ద్వితీయ బహుమతి.
⦁హాస్పిటల్స్ విభాగంలో లాలా గూడలోని సెంట్రల్ హాస్పిటల్ కు మెరిట్ సర్టిఫికేట్.
⦁రైల్వే స్టేషన్ల విభాగంలో హైదరాబాద్ రైల్వే స్టేషన్ కు మెరిట్ సర్టిఫికేట్.
⦁రైల్వే స్టేషన్ల విభాగంలో నిజామాబాద్ రైల్వే స్టేషన్ కు మెరిట్ సర్టిఫికేట్.