కోల్ కతా – దేశంలోని తొలి మెట్రో వాటర్ టన్నెల్ రైలు మార్గాన్ని ప్రారంభించందుకు కోల్ కతా వచ్చిన ప్రధాని మోడీని నేడు సందేశ్‌ఖాలీ బాధితులు కలిశారు. ఈ సందర్భంగా తమకు ఎదురైన సమస్యలను ప్రధానికి చెప్పుకుని న్యాయం చేయాలని వేడుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన షాజహాన్‌పై భూకబ్జాలు, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సందేశ్‌ఖాలీ మహిళలు ఆరోపించారు. ఈ సందర్భంగా తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. ప్రధాని ఎంతో ఓపికగా వారి ఆవేదనను విని కలత చెందారు. దీంతో బాధిత మహిళలు మరింత భావోద్వేగానికి గురయ్యారు. వారికి తగిన న్యాయ చేస్తానని హామీ ఇచ్చారు..
కాగా, గత నెలలో స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ షాజహాన్, ఆయన అనుచరులు పలువురు మహిళలపై లైంగిక దాడులు, భూ ఆక్రమణలకు పాల్పడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దీనిపై బీజేపీ తీవ్ర నిరసనలు వ్యక్తం చేయగా, మహిళలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. కోర్టు జోక్యం చేసుకోవడంతో 40 ఏళ్ల షాజహాన్‌ను గతవారంలో బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సిందిగా కోల్‌కతా హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది.