Friday, November 22, 2024

తెలుగు వైద్యులకు జాతీయస్థాయి గుర్తింపు.. ఇన్‌స్పైరింగ్ డాక్టర్స్‌గా విష్ణున్ రావు, విజయ్ కుమార్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు విశేష కృషి చేసిన ఇద్దరు తెలుగు వైద్యులకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. ఓ ఆంగ్ల దినపత్రిక నిర్వహించిన ‘డాక్టర్స్ డే – ఇన్‌స్పైరింగ్ డాక్టర్స్’ కార్యక్రమంలో ‘కోవిడ్ ఫ్రంట్‌లైన్ వారియర్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పల్మనాలజీ’ విభాగంలో తెలంగాణ నుంచి శ్వాస హాస్పిటల్ చైర్మన్ డా. విష్ణున్ రావు వీరపనేని, డా. ఆర్ విజయ్ కుమార్ అవార్డు అందుకున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 20 మందిని ఎంపిక చేయగా, అందలో ఇద్దరు తెలుగువారికి చోటుదక్కడం విశేషం. ఢిల్లీలోని హోటల్ హయత్ రిజెన్సీలో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పాల్గొన్నారు.

కోవిడ్-19 సోకినవారికి ఇంట్లోనే ఉండి వైద్యం ఎలా పొందాలన్న అంశంపై డా. విష్ణున్ రావు అవగాహన కార్యక్రమాలు రూపొందించారు. అవసరం లేకపోయినా ఆస్పత్రుల్లో చేరవద్దని చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లో ఆస్పత్రులను ఆశ్రయించాలి అనే విషయంపై ప్రజల్లో అవగాహన పెంపొందించారు. అలాగే ఊపితిత్తులకు సంబంధించి అన్ని వ్యాధులపై అనేక అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. ముక్యంగా అలర్జీ, ఆస్తమా వ్యాధిపై అందరికీ అవగాహన కలిగిస్తున్నారు. కాలుష్యం కారణంగా ప్రజారోగ్యం ఎలా దెబ్బతింటుందో అందరికీ అవగాహన కలిగిస్తున్నారు. పిల్లల ఊపితిత్తుల జబ్బుల గురించి ఎన్నో అవగాహనా కార్యక్రమాలు నిర్యహించారు. గత 25 సంవత్సరాలుగా ఆరోగ్య సూత్రాలపై కలిగిస్తున్న అవగాహనకు గుర్తింపుగా ఈ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును కోవిడ్ వారియర్స్ అందరికీ అంకితం చేస్తున్నానని డా. విష్ణున్ రావు ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement