హైదరాబాద్, ప్రభన్యూస్: నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు ఎల్బీ ఇండోర్ స్టేడియంలో హోరాహోరీగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు తమ సత్తా చాటుతున్నారు. రెండోరోజు సబ్ జూనియర్ 53కేజీల కేటగిరిలో గుజరాత్‌కు చెందిన రాహుల్ సాహూ 380 కేజీల బరువు ఎత్తి ప్రథమస్థానంలో నిలిచాడు. మహారాష్ట్రకు చెందిన సర్వేశ్ 372.50కేజీలు, తమిళనాడుకు చెందిన యోగేశ్ 362.50కేజీలతో రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. 59కేజీల విభాగంలో తమిళనాడుకు చెందిన అరుణ్ , ఉత్తరప్రదేశ్‌కు చెందిన రోహిత్‌కుమార్, ఉత్తరాఖండ్‌కు చెందిన దీపాన్షు, తొలి మూడుస్థానాల్లో నిలిచారు.
66కేజీల విభాగంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆయుశ్ కటియార్, తమిళనాడుకు చెందిన ప్రశాంత్, ఉత్తరాంఖండ్‌కు చెందిన గౌతమ్‌కుమార్ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. ఈ పోటీలను తెలంగాణ తెలంగాణ పవర్‌లిఫ్టింగ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్వరి శ్రీనివాస్, నిర్వాహకులు పర్యవేక్షిస్తున్నారు. ఈ టోర్నీ 20న ముగియనుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital