Saturday, November 23, 2024

National – వేద గడియారాన్ని ప్రారంభించనున్న ప్రధాని

ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేడు ప్రపంచంలోనే మొట్టమొదటి ‘వేద గడియారాన్ని ప్రారంభించనున్నారు. ఈ గడియారం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ప్రధాని చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభం కానుంది.

ఈ గడియారం’విక్రమాదిత్య వేద గడియారం’ పేరుతో సిద్ధమైంది. ఈ వేద గడియారాన్ని ప్రధానమంత్రి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ గడియారంలో అనేక విశేషాలున్నాయి. ఇది పురాతన భారతీయ సంప్రదాయ పంచాంగం ప్రకారం పనిచేయనుంది.ఈ వేద గడియారం భారత కాల గణన విధానం ప్రకారం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనదని నిర్వాహకులు ఓ ప్రకటనలో పేర్కొనడం జరిగింది. భారత కాల గణన విధానం సూక్ష్మమైనదని, స్వచ్ఛమైనదని, దోషరహితమైనదని కూడా వారు వివరించారు.

85 అడుగుల ఎత్తున్న టవర్‌పై వేద గడియారం :

ఈ గడియారం ఉజ్జయినిలోని జంతర్ మంతర్ ఏరియాలో 85 అడుగుల ఎత్తున్న టవర్‌పై ఈ వేద గడియారాన్నిఅమర్చారు. . వేద హిందూ పంచాంగం సమాచారాన్ని ఈ ‘వేద గడియారం’ ప్రదర్శిస్తుంది. ఈ గడియారం సంవత్సరం, మాసం, చంద్రుడి స్థానం, శుభ గడియలు, నక్షత్రం, సూర్యగ్రహణం, చంద్ర గ్రహణం వంటి ఇతర వివరాలను, సమాచారాన్ని కూడా అందించడం జరుగుతుంది. ఇది కాల గణన పద్దతి ప్రకారం పనిచేస్తోంది.ఈ గడియారం సమాయన్ని కూడా లెక్కిస్తోంది. ఒక సూర్యోదయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం ఆధారంగా ఈ గడియారం సమయాన్ని లెక్కిస్తుంది. గ్రహాల స్థితిగతులు, ముహూర్తం, జ్యోతిష గణనలు, అంచనాలకు సంబంధించిన సమాచారాన్నిఈ గడియారంలో డిస్‌ప్లే చేస్తుంది. అంతేకాదు భారత ప్రామాణిక కాలం (IST), జీఎంటీ (GMT)లను కూడా ఈ వేద గడియారం సూచిస్తుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement