బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా నివాసంలో మీటింగ్
మోదీ, అమిత్ షా ,చంద్రబాబు తో సహ కూటమి నేతల హాజరు
న్యూ ఢిల్లీ – ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో నేడు నిర్వహించారు…ఎన్డీఏలో కీలక భాగస్వామ్య పక్షంగా ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు తో పాటు కూటమి పార్టీల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు ఇటివల జరుగుతున్న పరిణామాలను ఎన్డీఎ నేతలకు వివరించారు..
”వక్ఫ్ సవరణ బిల్లు”, “ఒకే దేశం, ఒకే ఎన్నిక” “129 వ రాజ్యాంగ సవరణ బిల్లు”పై భాగస్వామ్యపక్షాల నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ బిల్లు త్వరగా పార్లమెంట్ లో ఆమోదముద్ర వేసేందుకు తీసుకోవలసిన చర్యలపై కూటమి నేతల అభిప్రాయాలను స్వీకరించారు.
ఇక మున్ముందు ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల మధ్య సమన్వయాన్ని మరింతగా దృఢతరం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై మంతనాలు జరిపారు. ఇక బాబా సాహెబ్ అంబేద్కర్ పై కేంద్రహోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమైన నేపథ్యంలో ఆ వ్యాఖ్యాల నేపధ్యాన్ని అమిత్ షా ఎన్డీఏ కూటమి భాగస్వామ్యపక్షాల నేతలకు వివరించారు. ఈ విషయంలో తమకు మద్దతు పూర్తిగా అమిత్ షా ఎన్డీఎ నేతలను కోరారు…