Tuesday, November 19, 2024

National – అత్తగారికి ప్రయారిటీ.. .తప్పేమీ కాదన్న కోర్టు

తన తల్లికి సమయం కేటాయించడం, డబ్బు ఇవ్వడం గృహ హింసగా పరిగణించ‌లేమ‌ని ముంబై సెషన్స్ కోర్టులో తేల్చి చెప్పింది.. భ‌ర్త త‌ల్లికి నెల నెల డ‌బ్బులు పంపడం, ఆమెకే ఎక్క‌వు విలువ ఇస్తున్న దానిపై మ‌హిళ కోర్టు ను అశ్ర‌యించింది. ముంబై రాష్ట్ర సచివాలయంలో అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మహిళ గృహ హింస నుంచి రక్షించాలని, తనకు పరిహారంగా డబ్బు ఇవ్వాలని ఫిర్యాదు చేసింది. తన తల్లి మానసిక ఆరోగ్యాన్ని బయటపెట్టకుండా తనను పెళ్లి చేసుకున్నట్లు ఆరోపించింది. తన అత్తగారు తాను ఉద్యోగం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారని, తనను వేధించేవారని, భర్త మరియు అతని తల్లి తనతో గొడవ పడేవారని మహిళ పేర్కొంది. తన భర్త సెప్టెంబర్ 1993 నుంచి డిసెంబర్ 2004 వరకు ఉద్యోగం కోసం విదేశాల్లో ఉన్నాడని, అతను సెలవుపై ఇండియా వచ్చినప్పుడల్లా, తన తల్లి వద్దకు వెళ్లేవాడని, ప్రతీ ఏడాది రూ. 10,000 పంపేవాడని, ఆమె కంటి ఆపరేషన్ కోసం కూడా ఖర్చు పెట్టాడని సదరు మహిళ తెలిపింది. తన అత్తామామల కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా వేధింపుకు గురిచేసేవారని ఆరోపించింది.

అయితే, కోడలు చేస్తున్న ఆరోపణల్ని అత్తామామలు కొట్టిపారేశారు. తను భర్తగా ఆమె ఎప్పుడూ అంగీకరించలేదని ఆమె భర్త ఫిర్యాదు ఆరోపించాడు. ఆమె క్రూరత్వం కారణంగా తాను ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశానని చెప్పాడు. ఎటువంటి సమాచారం లేకుండా తన భార్య తన NRE (నాన్ రెసిడెంట్ ఎక్స్‌టర్నల్) ఖాతా నుండి రూ 21.68 లక్షలు విత్‌డ్రా చేసిందని, ఆ మొత్తంతో ఫ్లాట్‌ను కొనుగోలు చేశారని కూడా అతను ఆరోపించాడు. మహిళ పిటిషన్ పెండింగ్‌లో ఉన్న సమయంలో ట్రయల్ కోర్టు ఆమెకు నెలకు రూ. 3000 మధ్యంతర భరణాన్ని మంజూరు చేసింది. అయితే, ఆమె ఇతరుల సాక్ష్యాలు నమోదు చేసిన తర్వాత మేజిస్ట్రేట్ కోర్టు ఆమె అభ్యర్థనను కొట్టేసింది. భరణాన్ని రద్దు చేసింది.

దీనిపై ఆ మహిళ ముంబై సెషన్స్ కోర్టును ఆశ్రయించింది. సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత మహిళ వాదనలు అస్పష్టంగా ఉన్నాయని, ఆమె గృహ హింసకు గురికాలేదని, తల్లికి డబ్బులు ఇవ్వడం, సమయాన్ని కేటాయించడం గృహ హింస కిందకు రాదని కోర్టు పేర్కొంది. విడాకులు కోరుతూ భర్త, నోటీసులు జారీ చేసిన తర్వాతే మహిళ ఈ రకమైన ఆరోపణలు చేస్తుందనే విషయాన్ని గుర్తు గుర్తించింది. ఆమె గృహ హింస నుంచి రక్షణ పొందేందుకు ఎలాంటి అర్హత లేదని చెప్పింది. ట్రయల్ కోర్టు తీర్పులో సెషన్స్ కోర్టు జోక్యం చేసుకోవాల్సి అవసరం లేదని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. త‌ల్లికి డ‌బ్బులు పంప‌డం గృహ హింస ఎలా అవుతుంద‌ని ఆమెకు మొట్టికాయాలు వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement