తమిళనాడు కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్లో ప్రధాని నరేంద్రమోడీ చేపట్టిన 45 గంటల ధ్యానాన్ని నేటి సాయంత్రం ముగించారు. ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా ఆయన మే 30న కన్యాకుమారి చేరుకున్నారు. హిందూ తత్వవేత్త స్వామి వివేకానంద ఒకప్పుడు ధ్యానం చేసిన అదే ప్రాంతంలో మోడీ ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించారు. లోక్సభ ఎన్నికల చివరి విడత ప్రచారం ముగిసిన కొద్దిసేపటికే ఆయన కన్యాకుమారి చేరుకున్నారు. చివరి విడత పోలింగ్ ముగిసే శనివారం ధ్యానాన్ని ముగించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement