ఇక్కడి పీహెచ్‌డీ కోర్సుకు జాతీయ స్థాయిలో డిమాండ్ ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. బేగంపేటలోని ‘సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్’ సెస్‌లో విద్యార్థునుల వసతి గృహానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక, సామాజిక స్థితిగతుల మీద అధ్యయనాలు చేస్తూ సెస్ ఎప్పటికపుడు విలువైన సూచనలు చేస్తున్నదని పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు చేరుతున్నారని తెలిపారు. వీరి అవసరాల నిమిత్తం రు.5 కోట్లతో బాలికల వసతి గృహం ఏర్పాటు చేసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. సమగ్రమైన ఆర్థిక, సామాజిక అధ్యయనం ఉన్నప్పుడే ఏ రాష్ట్రం అయినా, దేశం అయినా పురోగతి చెందుతుందన్నారు. ఆ ఫలితాల ఆధారంగా మంచి పరిపాలన అందించడం సాధ్యం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, సెస్ ఫౌండర్ మెంబర్లు మహేందర్ రెడ్డి, జీఆర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital