Monday, November 25, 2024

National – జ‌ర్న‌లిస్టులు ఉద్యోగులు కాదు… స్పెషల్ స్టేట‌స్​లోనే పాత్రికేయులు

స‌మాజంలో ప్ర‌త్యేక గుర్తింపు ఉంది
కార్మిక చట్టాలు వారికి వ‌ర్తించ‌వు
వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్ట్ చ‌ట్టంలోనే వారి విధి విధానాలు
ఉద్యోగుల‌మ‌ని చెప్పుకోకండి.. జ‌నాలు న‌వ్వుకుంటారు
ముంబై హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

దేశవ్యాప్తంగా జర్నలిస్టులు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇంకో మాట చెప్పాలంటే రెండు కోట్ల మంది గుర్తింపు పొందని జర్నలిస్టులు ఉన్నారని ఒక అంచనా ఉంది. అయితే.. వీరు ఉద్యోగులా? కాదా? అనే చర్చ ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే.. వారు పనిచేస్తున్న మీడియా సంస్థలు ఎంతో కొంత జీతాల రూపంలో ఇస్తున్నాయి. అయితే.. తాజాగా బాంబే హైకోర్టు ఓ వివాదాన్ని పరిష్కరించే క్రమంలో జర్నలిస్టులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వర్కింగ్ జర్నలిస్ట్‌లు ఉద్యోగుల పరిధిలోకి రారని తేల్చి చెప్పింది. ఇద్దరు జర్నలిస్ట్‌లు తమని కార్మిక శాఖ పరిధిలోకి చేర్చకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ 2019 ముంబై హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై తుది విచారణ చేపట్టిన జస్టిస్ నితిన్ జందర్, జస్టిస్ సందీప్ మర్నేతో కూడిన ధర్మాసనం వాళ్లకు సమాజంలో స్పెషల్ స్టేటస్ లభిస్తోందని, వాళ్లని ఈ చట్టాల పరిధిలోకి తీసుకురావడం కుదరదని స్పష్టం చేసింది.

స్పెషల్​ స్టేటస్​ ఉంది..

వర్కింగ్‌జర్నలిస్టుల చట్టం 1955 ని పరిశీలించింది. తమ సమస్యల్ని పరిష్కరించుకునేందుకు జర్నలిస్ట్‌లకు ఇప్పటికే ఈ చట్టం సహకరిస్తోందని వివరించింది. వర్కింగ్ జర్నలిస్టు చట్టం కింద జర్నలిస్ట్‌లకు స్పెషల్ స్టేటస్ ఉందని, వాళ్ల సమస్యల్ని పరిష్కరించు కునే అవకాశమూ ఉందని బాంబే హైకోర్టు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement