నెల్లూరు – భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చీఫ్ సోమనాథ్ క్యాన్సర్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు రూపొందించిన ‘ఆదిత్య ఎల్ 1 ‘ ప్రయోగం చేపట్టిన రోజే వ్యాధి నిర్ధరణ అయినట్లు తెలిపారు. ఓ మలయాళం వెబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్లు చెప్పారు.
‘చంద్రయాన్-3 ప్రయోగం సమయంలోనే ఆరోగ్య సమస్యలు వచ్చాయని, . ఆ సమయంలో దాని గురించి నాకు స్పష్టమైన అవగాహన లేదని అన్నారు. . కానీ, ఆదిత్య-ఎల్1 మిషన్ ప్రయోగించిన తర్వాత చెన్నై వెళ్లి మరిన్ని స్కాన్‌లు చేయించాని తెలిఆపారు.. . నా కడుపులో కణితి పెరిగిందని. మరో రెండు, మూడు రోజుల తర్వాత క్యాన్సర్ అని నిర్ధరణ అయ్యిందని చెప్పారు. అది వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి’ అని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబసభ్యులతో పాటు సహోద్యోగులు షాక్‌కు గురయ్యారన్నారు.
‘సెప్టెంబర్ 2, 2023న ఆదిత్య ఎల్1 ప్రయోగం చేపట్టిన తర్వాత ఆపరేషన్ చేయించుకోవాలని వైద్యులు సూచన మేరకు శస్త్రచికిత్సతోపాటు కీమోథెరపీ కూడా చేయించుకున్నానని చెప్పారు… మొత్తంగా నాలుగు రోజులే ఆసుపత్రిలో ఉన్నానని, . ఐదోరోజు నుంచి ఇస్రోలో రోజూవారీ బాధ్యతల్లో నిమగ్నమయ్యాయని అన్నారు..