Thursday, November 21, 2024

రఘురామ కేసు: ఏపీ హోంశాఖ, డీజీపీలకు సమన్లు

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు వ్యవహారంపై నివేదిక పంపాలని జారీ చేసిన నోటీసులకు ఏపీ ప్రభుత్వం స్పందించకపోవడంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్సీ) అసహనం వ్యక్తం చేసింది. తనను ఏపీ సీఐడీ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని, విచారణ సందర్భంగా తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఎంపీ రఘురామ ఎన్ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదును స్వీకరించిన ఎన్ హెచ్ఆర్సీ గతంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు పంపింది. రఘురామ అరెస్ట్ పై నివేదిక పంపాలని ఆదేశించింది.

అయితే, ఆ నోటీసులకు ఏపీ ప్రభుత్వం స్పందన లేకపోవడంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ హోంశాఖ కార్యదర్శి, డీజీపీలకు తాజాగా కండిషనల్ సమన్లు జారీ చేసింది. నివేదిక పంపడంలో ఎందుకు జాప్యం ఏర్పడిందంటూ ఎన్ హెచ్చార్సీ అసహనం వ్యక్తం చేసింది. ఆగస్టు 9 లోపు నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించింది. గడువులోగా నివేదిక అందించకపోతే, ఆగస్టు 16న వ్యక్తిగతంగా హాజరు కావాలని హోంశాఖ కార్యదర్శి, డీజీపీలకు హెచ్చరించింది.

ఇది కూడా చదవండి: ఇంటర్ పాసైన విద్యార్థులు అలర్ట్… డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్!

Advertisement

తాజా వార్తలు

Advertisement