తెలుగు సినీ పరిశ్రమకు ఇప్పటి వరకు అందని ద్రాక్షలాగా మారిపోయిన బెస్ట్ యాక్టర్ అవార్డును అల్లు అర్జున్ అందుకున్నాడు. దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగు సినిమాలో ఇప్పటివరకు మహామహులే సాధించలేని అరుధైన ఘనతను అల్లు అర్జున్ సాధించి సంచలనం సృష్టించాడు.న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో 69వ నేషనల్ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పుష్ప మూవీలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్వీకరించారు.. ఇక ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికై ఉప్పెన మూవీకి గాను నిర్మాత నవీన్ ఎర్నేని, దర్శకుడు బుచ్చిబాబు సనాలు జాతీయ అవార్డు అందుకున్నారు. అనంతరం బెస్ట్ కొరియోగాఫర్‌గా నాటు నాటు పాటకు ప్రేమ్ రక్షిత్ , ఉత్తమ లిరిసిస్ట్ గా కీరవాణి, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవీశ్రీ ప్రసాద్ స్వీకరించారు..
ఉత్తమ వినోదాత్మక, పాపులర్ మూవీగా ఆర్ ఆర్ ఆర్ ఎంపిక కాగా, ఆ అవార్డులను ఎస్ ఎస్ రాజమోళి రాష్ట్రపతి నుంచి అందుకున్నారు. ఇక ఉత్తమ యాక్షన్ డైరెక్షన్(స్టంట్ కొరియోగ్రఫీ) – కింగ్ సాల్మన్ (ఆర్‌ఆర్‌ఆర్), ఉత్తమ కొరియోగ్రఫీ – ప్రేమ్ రక్షిత్ (ఆర్‌ఆర్‌ఆర్), ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ – వి.శ్రీనివాస్ మోహన్ (ఆర్‌ఆర్‌ఆర్) , ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ (బ్యాగ్రౌండ్ లస్కోర్) – ఎమ్‌ఎమ్ కీరవాణి (ఆర్‌ఆర్‌ఆర్) , ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (మేల్) – కాల భైరవ (కొమురం భీముడో.. – ఆర్‌ఆర్‌ఆర్) లు స్వీకరించారు.. ఇక ఉత్తమ నటి అవార్డును అలియా భల్, కృతి సనన్ షేర్ చేసుకున్నారు.. ఈ హీరోయిన్స్ కూడా అవార్డును ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు.