Saturday, November 23, 2024

National – ఢిల్లీ చుట్టూ ఇనుప కంచెలు – రైతుల ‘ఛలో ఢిల్లీ’ తో హైటెన్ష‌న్

పంజాబ్ రైతు సంఘాల నాయకులతో కేంద్ర మంత్రుల బృందం సుమారు 5 గంటలపాటు జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగియడంతో ‘ఢిల్లీ ఛలో’ మార్చ్ ను రైతులు చేప‌ట్టారు. మంగళవారం ఢిల్లీలో జ‌రిగే ధర్నా కోసం రైతుల సంఘాల నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. 250కి పైగా రైతు సంఘాల మద్దతున్న ‘కిసాన్ మజ్దూర్ మోర్చా’, దాదాపు 150 సంఘాలతో కూడిన ‘కిసాన్ మోర్చా’ డిసెంబర్‌లోనే నిరసనకు పిలుపునివ్వడంతో పెద్ద సంఖ్యలో ఢిల్లీకి త‌ర‌లివ‌చ్చారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. బారీకేడ్లతో నగర సరిహద్దులను మూసివేశారు. ర్యాలీలు, నిరసనలపై నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో అపరిష్కృతంగా ఉన్న రైతుల ప్రధాన డిమాండ్లు పరిశీలిద్దాం.

రెండెళ్ల క్రితం హామీ ఇచ్చినా, నెర‌వేర్చ‌ని కేంద్రం

రైతుల డిమాండ్లలో ప్రధానమైనది పంటలకు కనీస మద్దతు.. మ‌ద్ద‌తు ధ‌ర హామీ ఇచ్చే చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్‌లో అనిశ్చితితో సంబంధం లేకుండా కనీస మద్దతు ధరకు హామీ లభించాలని కోరుతుకున్నారు. విద్యుత్ చట్టం 2020 రద్దు, లఖింపూర్ ఖేరీ ఘటనలో మృతి చెందిన రైతులకు నష్టపరిహారం పరిహారం చెల్లింపు, రైతు ఉద్యమంలో పాల్గొన్న వారిపై కేసుల ఉపసంహరణ రైతుల ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి. రెండేళ్ల క్రితం పలు డిమాండ్ల పరిష్కారానికి కేంద్రం హామీ ఇచ్చినా నెరవేర్చకపోవడంతో ధర్మా చేపట్టాలని రైతులు నిర్ణయించారు.

పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర..

2020-21 రైతు ఆందోళన సమయంలో రైతులపై నమోదయిన కేసు ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినప్పటికీ.. తమ డిమాండ్లలో అత్యంత ముఖ్యమైన ‘కనీస మద్దత ధర’కు’ హామీ ఇవ్వాలని రైతులు పట్టుబడుతున్నారు. ఇక ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలో ప్రభుత్వ నిబద్ధతపై రైతు సంఘాల నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కనీస మద్దతు ధర, రుణమాఫీ డిమాండ్ల విషయంలో స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల అమలును పరిశీలించేందుకు కేంద్రం ఒక కమిటీని ప్రతిపాదించింది. అయినప్పటికీ రైతులు వెనక్కి తగ్గడం లేదు. ఇక భూసేకరణ చట్టం-2013 పునరుద్దరణ, ప్రపంచ వాణిజ్య సంస్థ నుంచి ఉపసంహరణ కూడా రైతుల డిమాండ్లలో ప్రధానమైనవిగా ఉన్నాయి.

- Advertisement -

హస్తిన చుట్టూ ఇనుప సంకెళ్లు …

1) హర్యానాలోని అధికారులు అంబాలా, జింద్, ఫతేహాబాద్, కురుక్షేత్ర.. సిర్సా వంటి ప్రదేశాలలో కాంక్రీట్ బ్లాక్‌లు, ఇనుప మేకులు, ముళ్ల తీగలను ఉపయోగించి పంజాబ్‌తో రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రతను పెంచారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో వాట‌ర్ కెన‌న్ల వాహ‌నాల‌ను మోహ‌రించారు.

2) ఢిల్లీకి ప్రవేశించే ప్రదేశాలను మూసివేయడానికి సింగు, తిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల వద్ద బహుళ లేయర్డ్ బారికేడింగ్ ఉంది. ఈ బారికేడ్‌లు, కాన్సర్టినా వైర్లు, గోర్లు, కాంక్రీట్ బ్లాక్‌లు.. కంటైనర్‌లతో బలోపేతం చేశారు. నిరసనకారులు నగరంలోకి రాకుండా, రక్షణను ఉల్లంఘించకుండా నిరోధించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. పై నుంచి పరిస్థితిని పర్యవేక్షించేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు.

3) టియర్ గ్యాస్ లాంచర్లు, బుల్లెట్ ప్రూఫ్ దుస్తులు, హెల్మెట్‌లు, లాఠీలు.. అధునాతన ఆయుధాలతో కూడిన ఢిల్లీ పోలీసులు.. పారామిలటరీ సిబ్బందితో కూడిన 50 కంపెనీలు సింగు, టిక్రి, ఘాజీపూర్ సరిహద్దుల్లోని వ్యూహాత్మక పాయింట్ల వద్ద మోహ‌రించారు. నిరసన కవాతులో ఏదైనా తీవ్రతరం అయితే నిరోధించ‌డానికి అధునాతన ఆయుధాలు కూడా వారి చేతిలో ఉన్నాయి.

4 ఇనుప బారికేడ్లు, జెర్సీ అడ్డంకులు, షిప్పింగ్ కంటైనర్లు, ముళ్ల కంచెలు, ఇనుప మేకులు, హైడ్రా క్రేన్లు, బస్సులు, ఇతర వాహనాలు సరిహద్దుల వద్ద మ‌ల్లీ-లేయర్డ్ గా ఏర్పాటు చేశారు. రైతుల నిర‌స‌న‌ల‌ను అడుకునేందుకు ఇలా ఏర్పాటు చేశారు.

5) ట్రాక్టర్లు, ట్రక్కులు లేదా ఇతర వాహనాల ఊరేగింపులు సిటీలోఇ ప్రవేశించడాన్ని ఒక నెల పాటు నిషేధిస్తూ ఢిల్లీ పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. అదనంగా, నిరసనకారులను తీసుకువెళుతున్న వాహనాలు ఢిల్లీలోకి రాకుండా సింగు, ఘాజీపూర్, తిక్రీ సరిహద్దుల వద్ద ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement