Friday, November 22, 2024

Delhi: మోదీ చేతుల మీదుగా నేషనల్‌ క్రియేటర్స్‌ అవార్డు ప్ర‌దానం…

న్యూఢిల్లీ – ఎన్నికల ఫలితాలనే ఈ సారి పునరావృతం చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. శుక్రవారం ఢిల్లీలోని భారత మండపంలో నేషనల్‌ క్రియేటర్స్‌ అవార్డులను ఆయన ప్ర‌దానం చేశారు. ఈ సంద‌ర్బంగా మోదీ మాట్లాడుతూ… సృజనాత్మక వీడియోలు, కథనాలతో సమాజంలో మార్పు కోసం కృషి చేస్తున్న కంటెంట్‌ క్రియేటర్స్‌ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను నూతనంగా ప్రవేశపెట్టింది. ”స్టోరీ టెల్లింగ్‌, సామాజిక మార్పు, పర్యావరణ పరిరక్షణ, విద్య, గేమింగ్‌ వంటి వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వారిని గుర్తించి, ప్రోత్సహించడమే ఈ అవార్డుల ముఖ్య ఉద్దేశం” అని తెలిపారు..

”మహిళా దినోత్సవం, శివరాత్రి రోజున ఈ అవార్డులను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. విజేతలకు నా అభినందనలు. సృజనాత్మకతతో ఈ రోజు మీరంతా ఇక్కడిదాకా చేరుకున్నారు. భారత్‌ భవిష్యత్తు గురించి చర్చించేందుకే మనమంతా ఇక్కడ సమావేశమయ్యాం. పరిస్థితులకు అనుగుణంగా వచ్చే మార్పులను స్వీకరించడం మన బాధ్యత. తక్కువ ధరకు డేటా, మొబైల్‌ ఫోన్లు లభిస్తుండటంతో ఎంతో మంది కంటెంట్‌ క్రియేటర్లకు అవకాశం లభిస్తోంది. ఈ అవార్డులు దేశంలోని ప్రతి యువ కంటెంట్ క్రియేటర్‌ ప్రతిభకు నిదర్శనం. గత ఎన్నికల్లో మాదిరే ఈ సారి భాజపా క్లీన్‌స్వీప్‌ చేస్తుంది. అదే మా లక్ష్యం” అని ప్రధాన మోదీ అన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛ అంబాసిడర్‌ అవార్డు అందుకున్న మల్హర్‌ కలాంబేను ఉద్దేశించి ‘సన్నగా కనిపిస్తున్నావ్‌.. బాగా తినాలి’ అని సరదాగా వ్యాఖ్యానించారు.

20 అవార్డుల కోసం 1.50 ల‌క్ష‌ల నామినేష‌న్స్

- Advertisement -

ఈ అవార్డుల కోసం 20 విభాగాల్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 1.5 లక్షల నామినేషన్స్ వచ్చాయి. వారికి మద్దతుగా పది లక్షల మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. అందులోంచి 23 మందిని విజేతలుగా ఎంపిక చేశారు. వీరిలో ముగ్గురు అంతర్జాతీయ క్రియేటర్స్ ఉన్నారు. మోస్ట్‌ క్రియేటివ్‌ క్రియేటర్‌ అవార్డును మహిళల విభాగంలో శ్రద్ధ, పురుషుల విభాగంలో ఆర్జే రౌనాక్‌ అందుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement