Saturday, November 23, 2024

National – బీజేపిది ఆర్థిక ఉగ్ర‌వాదం . కాంగ్రెస్ నేత‌ల‌ ఫైర్

న్యూ ఢిల్లీ – బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం ఆర్థిక ఉగ్ర‌వాదానికి పాల్పడుతున్న‌ట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. త‌మ పార్టీకి చెందిన అకౌంట్ల నుంచి ఆ స‌ర్కార్ 65 కోట్లు లూటీ చేసినట్లు విమ‌ర్శించింది. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందు త‌మ పార్టీని ఆర్థికంగా దెబ్బ‌తీసేందుకు ప్ర‌భుత్వం య‌త్నిస్తున్న‌ట్లు కాంగ్రెస్ పేర్కొన్న‌ది. ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేసి, నియంతృత్వ రాజ్యాన్ని ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంద‌ని ఆరోపించింది. ఏఐసీసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో గురువారం జ‌రిగిన ప్రెస్‌మీట్‌లో కాంగ్రెస్ నేత‌లు కేసీ వేణుగోపాల్‌, అజ‌య్ మాకెన్ మీడియాతో మాట్లాడారు. త‌మపై ట్యాక్స్ టెర్ర‌రిజం దాడులు జ‌రుగుతున్నాయ‌ని మ‌రో నేత జైరాం ర‌మేశ్ ఆరోపించారు. కాంగ్రెస్‌ను ఆర్థికంగా కూల్చేందుకు కుట్ర ప‌న్నార‌ని ఆరోపించారు. భార‌త్ జోడో యాత్ర‌, రైతు ఉద్య‌మం, ద్ర‌వ్యోల్బ‌ణం వ‌ల్ల బీజేపీ వ‌త్తిడికి లోనైన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. ఆదాయ‌ప‌న్ను శాఖ ద్వారా త‌మ పార్టీ అకౌంట్‌లో ఉన్న 65 కోట్ల‌ను లూటీ చేశార‌ని మాకెన్ ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement