బిజెపి 290 స్థానాలలో లీడ్
ఇండియా కూటమికి 227 చోట్ల అధీక్యం
యపిలో కమలానికి షాక్
మహారాష్ట్రలోనూ ఝలక్
గుజరాత్, కర్నాటక,మధ్యప్రదేశ్,
బీహార్ ,ఢిల్లీలో కషాయదళం పట్టు
పశ్చిమ బెంగాల్ లో దీదీదే హవా
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం చాటుకుంది. ఆ పార్టీ 290 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. 2019 ఎన్నికల్లో బీజేపీ 303 స్థానాల్లో విజయం సాధించింది. నాటి ఎన్నికలతో పోల్చితే బీజేపీ 57 స్థానాలు తక్కువగా ఆధిక్యంలో ఉంది. ఇక ఈ ఎన్నికలలో కాంగ్రెస్ ఘననీయంగా పుంజుకుంది.. ఇండియా కూటమిగా పోటీ చేసిన కాంగ్రెస్ ఈ ఎన్నికలలో ఇప్పటి వరకు 100 స్థానాలకు పైగా లీడ్ లో ఉంది.. మూడు గంటల వరకు జరిగిన లెక్కింపుల కాంగ్రెస్ పార్టీ 88 స్థానాలు, సమాజ్‌వాది పార్టీ 32 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ 52 స్థానాల్లో మాత్రమే గెలిచింది. నాటి ఎన్నికలతో పోల్చితే ఇప్పుడు ఆ పార్టీ 36 స్థానాలు ఎక్కువగా ముందంజలో ఉంది. సమాజ్‌వాది పార్టీ 2019లో కేవలం 5 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యింది.
యూపీ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అంచనాలు తలకిందులయ్యాయి. రాష్ట్రంలో 60కి పైగా స్థానాల్లో గెలుపొందాలని ఆపార్టీ లక్ష్యంగా పెట్టుకుంది.. అయితే.. అక్కడ బీజేపీకి సమాజ్ వాది పార్టీ గట్టిపోటీనిస్తోంది. మొత్తం 80 స్థానాల్లో.. తాజా ట్రెండ్స్ ను పరిగణలోకి తీసుకుంటే.. యూపీలో 37 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా.. ఎస్పీ 30, కాంగ్రెస్ 7, ఆర్ఎల్డీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
మహారాష్ట్ర లోనూ ఎన్డీఎకు షాక్
మహారాష్ట్ర లోక్ సభ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ కూటమి పైచేయి సాధించింది. మహారాష్ట్రలోని మొత్తం 48 లోక్‌సభ నియోజకవర్గాల్లో..ఎన్డీఎ 20 స్థానాల్లో, ఇండియా కూటమి 27 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఎంఐఎం ఒకస్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది.
కర్ణాటక కమలం జోరు
కర్ణాటకలో బీజేపీ మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం 28 స్థానాల్లో బీజేపీ 17 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ 8 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ భాగస్వామ్యపక్షమైన జేడీఎస్ 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఢిల్లీ లో ఎదురులేని బిజెపి
దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ పైచేయి సాధించింది. మొత్తం 7 లోక్‌సభ స్థానాల్లో 6 నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ ఒక స్థానంలో ముందంజలో ఉంది.
బీహార్ ఎన్డీఎ కూటమిదే హావా
బీహార్‌లో ఎన్డీయే కూటమి హవా కొనసాగుతోంది. జేడీయు 15 స్థానాలు, బీజేపీ 12, ఎల్జేపీ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఆర్జేడీ 3 స్థానాలు, ఇతరులు 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
పశ్చిమ బెంగాల్:
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. మొత్తం 42 స్థానాల్లో టీఎంసీ 32 స్థానాల్లో ముందంజలో ఉండగా.. బీజేపీ 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
గుజరాత్:
గుజరాత్‌లో బీజేపీ దాదాపు క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోతోంది. మొత్తం 26 స్థానాల్లో బీజేపీ 25, కాంగ్రెస్ 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్:
ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి హవా కొనసాగుతోంది. ఎన్డీయే కూటమిలోని టీడీపీ 16, బీజేపీ 4, జనసేన 2 స్థానాల్లో ఆధిక్యంలో నిలుస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
తెలంగాణలోనూ బిజెపిదే..
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ నెలకొంది. మొత్తం 17 స్థానాల్లో కాంగ్రెస్ 7 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ 8 స్థానాలు, ఎంఐఎం 1 స్థానంలో ముందంజలో ఉన్నాయి.
మధ్యప్రదేశ్ బిజెపి క్లీన్ స్వీప్ ..
మధ్యప్రదేశ్‌లో బీజేపీ క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోతోంది. మొత్తం 29 స్థానాల్లో అన్ని స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఇండియా కూటమికి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదు
కేరళలో కాంగ్రెస్ దే పై చేయి
కేరళలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. మొత్తం 20 స్థానాల్లో కాంగ్రెస్ 16 స్థానాల్లో ఆధిక్యంలో నిలుస్తోంది. బీజేపీ 2, సీపీఎం 1, స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పంజాబ్:
పంజాబ్‌లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య హోరాహోరీ నెలకొంది. కాంగ్రెస్ 6 స్థానాలు, ఆప్ 3 స్థానాలు, శిరోమణి అకాలీదళ్ 2 స్థానాలు, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
ఛత్తీస్‌గఢ్:
ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ జోరు కొనసాగుతోంది. మొత్తం 11 స్థానాల్లో బీజేపీ 10 స్థానాల్లో ఆధిక్యంలో నిలుస్తుండగా.. కాంగ్రెస్ 1 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది.
రాజస్థాన్ లో బిజెపి దూకుడు
రాజస్థాన్ లో బీజేపీ జోరు కొనసాగుతోంది. మొత్తం 25 స్థానాలకు గానూ, బీజేపీ 14 స్థానాల్లో ఆధిక్యంలో నిలుస్తుండగా.. కాంగ్రెస్ 11 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతోంది.