హైదరాబాద్: Q న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నపై తెలంగాణ ప్రభుత్వం వరుసగా దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈనెల 10న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ జాతీయ బీసీ కమిషన్‌ను సంప్రదించిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా తీన్మార్ మల్లన్నపై జరుగుతున్న వరుస దాడులు, క్యూ న్యూస్ కార్యాలయానికి సంబంధించిన కంప్యూటర్లను పగలగొట్టి హార్డ్ డిస్కులు ఎత్తుకెళ్లిన పోలీసుల చర్యలపై జాతీయ బీసీ కమిషన్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఒక జర్నలిస్టును దారుణంగా హింసించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. ప్రజల పక్షాన పోరాడుతున్న వ్యక్తిని హతమార్చాలని చూస్తున్నారా అంటూ మండిపడింది. ఈ నెల 29న వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను తమ ముందు తప్పనిసరిగా హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దాడులు ఇలాగే కొనసాగితే చర్యలు తీవ్రంగా ఉంటాయని సూచించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement