Friday, November 22, 2024

మానకొండూరు ఆరోగ్య కేంద్రానికి జాతీయ అవార్డు..

ఉమ్మడి కరీంనగర్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: ఉత్తమ సేవలు అందిస్తున్న జిల్లా, ఏరియా దవాఖానలతో పాటు పీహెచ్‌సీలకు కేంద్ర ప్రభుత్వం కాయకల్ప అవార్డులు ప్రకటించగా, ఉమ్మడి జిల్లాలో మూడు ఎంపికయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా దవాఖానకు మూడోసారి అవార్డు దక్కింది. ఇటీవలే ఆధునీకరించిన వేములవాడ ఏరియా ఆస్పత్రి, మానకొండూరు సీహెచ్‌సీలు అవార్డులను సొంతం చేసుకున్నారు. ప్రభుత్వ సహకారం, మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో కార్పొరేట్‌కు ధీటైన వైద్య సేవలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో అందుబాటులోకి వచ్చాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్ర దవాఖాన పారిశుధ్య నిర్వహణ, రోగులకు అందుతున్న సేవలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కాయకల్ప అవార్డు-2022లో రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచింది. 2020లో మొదటి స్థానం రాగా, 2021లో ద్వితీయస్థానం దక్కించుకున్నది. వేములవాడ ఏరియా దవాఖాన ప్రారంభమైన ఏడాది లోపే కాయకల్ప అవార్డుకు ఎంపిక కాగా, రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. మానకొండూర్‌ పీహెచ్‌సీ 84.83 మార్కులతో అవార్డు సొంతం చేసుకున్నది. అవార్డుతో పాటు రూ.10 లక్షల ప్రోత్సాహాన్ని అందించనుంది. కరీంనగర్‌ జిల్లా మానకొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వరుసగా జాతీయ అవార్డు రావడం రెండోసారి. రోగులకు అందిస్తున్న వైద్యసేవలు, ఆస్పత్రి నిర్వహణ, సిబ్బణది పనతీరు, సదుపాయల కల్పన కు గాను కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ పీహెచ్‌సీకి మొత్తం 83.30 మార్కులు లభించి అవార్డును సొంతం చేసుకోవడం పట్ల మండల వైద్యాధికారి డాక్టర్‌ కంద్‌శియా, వైద్య సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

మంత్రి కేటీఆర్‌ మార్గదర్శనం వల్లే..
మంత్రి కేటీఆర్‌ సంపూర్ణ సహకారం, మార్గదర్శనం వల్లే జిల్లా దవాఖాన, వేములవాడ దవాఖానకు అవార్డులు వచ్చాయి. అవార్డులు మరింత బాధ్యతను పెంచాయి. రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేందుకు ఈ అవార్డులు ప్రేరణగా నిలుస్తాయి. వైద్యులు, సిబ్బంది పనితీరు నిబద్దతకు ఈ అవార్డుతో తగిన గుర్తింపు వచ్చింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement