ధేశంలో మొత్తం 542 స్థానాలకు పోలింగ్ కొనసాగుతున్నది.. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం ఎన్డీఎ కూటమి 297, ఇండియా కూటమి 227 . ఇతరులు 19 స్థానాలలోనూ అధీక్యంలో ఉన్నాయి..
మోదీకి గట్టి పోటీనిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి
ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేసిన లోక్ సభ నియోజకవర్గం వారణాసిలో హోరాహోరీ కొనసాగుతోంది. ఓ దశలో ప్రధాని మోదీ వెనుకబడ్డారు. తాజాగా ఆయన మళ్లీ లీడ్ లోకి వచ్చారు. రెండో రౌండ్ లో వెనుకబడ్డ మోదీ.. మూడో రౌండ్ కు వచ్చేసరికి పుంజుకున్నారు. తన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ కన్నా 619 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ప్రధాని మోదీకి ఇప్పటి వరకు పోలైన ఓట్లు 36,424 కాగా, ఆయన ప్రత్యర్థి అజయ్ రాయ్ కి 35,805 ఓట్లు పోలయ్యాయి. ఆధిక్యం స్వల్పంగానే ఉండడంతో బీజేపీ వర్గాల్లో ఆందోళన నెలకొనగా.. కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
లోక్‌సభ ట్రెండ్స్‌లో లీడ్‌లో ఎన్డీయే కూటమి
కోయంబత్తూరులో బీజేపీ లీడింగ్
గుజరాత్‌లోని ఆనంద్ సెగ్మెంట్‌లో కాషాయం ఆధిక్యం
యూపీ మైన్‌పురిలో అఖిలేష్ భార్య డింపుల్ లీడింగ్
బెంగాల్‌లోని డైమండ్ హార్బర్ సెగ్మెంట్ నుంచి..
మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ లీడింగ్
రాయబరేలిలో రాహుల్‌గాంధీ ఆధిక్యం
ఢిల్లీలోని ఏడు సీట్లలో బీజేపీ లీడింగ్
వారణాసిలో బీజేపీ అభ్యర్థి ప్రధాని నరేంద్ర మోదీ ఆధిక్యంలో ఉన్నారు.
అటు గాంధీనగర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముందంజలో ఉన్నారు.
అలాగే నాగ్‌పూర్‌లో నితిన్ గడ్కరీ ఆధిక్యంలో ఉన్నారు.
కేరళలోని వయనాడ్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముందంజలో ఉన్నారు.
తమిళనాడు కీలక నేతలు మాత్రం వెనుకబడ్డారు.
తొలుత ఆధిక్యంలో కనిపించిన కోయంబత్తూరు బీజేపీ అభ్యర్థి, ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అన్నామలై ఆ తర్వాత వెనుకబడ్డారు. చెన్నై దక్షిణ స్థానం నుంచి పోటీ చేసిన తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వెనుకంజలో ఉన్నారు.
బీజేపీ మద్దతుతో రామనాథపురం నుంచి పోటీ చేస్తున్న పన్నీరుసెల్వం వెనుకంజలో ఉన్నారు.
కేరళలోని తిరువనంతపురం నుంచి కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్, త్రిసూర్ బీజేపీ అభ్యర్థి సురేశ్ గోపి వెనుకంజలో ఉన్నారు. తిరువనంతపురంలో కాంగ్రెస్ అభ్యర్థి శశిథరూర్ ముందంజలో ఉన్నారు.