నాసిక్ స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఉదయం 6.30కి శంషాబాద్ నుంచి బయల్దేరిన విమానంలో సాంకేతిక లోపం ఏర్పడినట్లు పైలట్ గుర్తించాడు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. అరగంట తర్వాత తిరిగి మళ్లీ శంషాబాద్‌లో విమానాన్ని ల్యాండింగ్ చేశారు. విమానంలోని 84 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. నాలుగు గంటలుగా ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు పడిగాపులు తప్పలేదు. మరో విమానం ఏర్పాటు చేయాలని ప్రయాణికులు ఆందోళనకు చేపట్టారు. సాంకేతిక లోపానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Nashik Spicejet : విమానంలో సాంకేతిక లోపం.. శంషాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్…
Advertisement
తాజా వార్తలు
Advertisement