చైన సహా పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ ఆందోళన కలిగిస్తున్న సమయంలో కేంద్రం ఊరట కలిగించే విషయం వెల్లడించింది. కరోనా నిరోధక నాసల్ వ్యాక్సిన్‌కు అనుమతులిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కోవిషీల్డ్, కోవ్యాక్సిన్ తీసుకున్న 18 ఏళ్లు పైబడినవారు బూస్టర్ డోస్‌గా ఈ నాసల్ వ్యాక్సిన్‌ను తీసుకోవచ్చని సూచించింది. కో-విన్ వేదికగా ఇన్‌కోవాక్ నాసల్ వ్యాక్సిన్‌ను పొందే వెసులుబాటుకల్పించింది.
ఇన్‌కోవాక్ నాసల్ వ్యాక్సిన్‌ను భారత్ బయోటెక్ తయారు చేసింది. అయితే ప్రస్తుతానికి ఈ నాసల్ వ్యాక్తిన్ ప్రైవేటు వైద్య కేంద్రాల్లో మాత్రమే లభ్యమవుతుంది. సూది లేకుండా రెండు చుక్కలను ముక్కులో వేసుకునే ఈ వ్యాక్సిన్‌కు గత నవంబర్‌లో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతించారు.
- Advertisement -