Friday, November 22, 2024

BJP: మరోసారి మోదీనే మా ప్రధానమంత్రి అభ్యర్థి.. స్పష్టం చేసిన అమిత్​షా!

రాబోయే జనరల్​ ఎలక్షన్స్​లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మళ్లీ మోదీనే ఉంటారని ఆ పార్టీ కీలక నేత కేంద్ర హోం మంత్రి అమిత్​ షా స్పష్టం చేశారు. పాట్నాలో జరిగిన బీజేపీ మోర్చాల రెండు రోజుల ఉమ్మడి జాతీయ కార్యవర్గం సమావేశంలో షా ఈ విషయాన్ని వెల్లడించారు. పార్టీ శ్రేణులెవరూ గందరగోళానికి గురికావొద్దని, మోదీ ఎన్నికల నుంచి రిటైర్​ అవబోతున్నారనే వార్తలు,పుకార్లను నమ్మొద్దన్నారు అమిత్​షా. అంతేకాకుండా 2024లో బీజేపీ-జేడీయూ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయని ప్రకటించారు.

అయితే.. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ప్రధానమంత్రి అభ్యర్థుల అంశంపై చర్చజరిగినప్పుడు బీజేపీ తమ అభ్యర్థిని ఈసారి మారుస్తుందన్న ఊహాగానాలు వెలువడ్డాయి. ఇదే దేశవ్యాప్తంగా ఇప్పుడూ హాట్ టాపిక్​గా మారింది. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని, కొత్తవారికి చాన్స్​ ఇస్తారన్న ఊహాగానాలు తరుచుగా వినిపిస్తున్నాయి. కాగా, 2024లో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీని ప్రకటించడం ద్వారా కేంద్ర మంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు అమిత్ షా గందరగోళానికి తెరదించినట్టయ్యింది.

దీనిపై బీజేపీ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ మాట్లాడుతూ.. 2024 లోక్‌సభ, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ కలిసి పోటీ చేస్తాయని అన్నారు. ఇందులో ఎలాంటి గందరగోళం లేదని తెలిపారు.  2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోనే మళ్లీ దేశానికి ప్రధాని అవుతారని, 2024లో అలాగే 2025లో బీహార్‌లో కలిసి ఎన్నికల్లో పోరాడాలని నిర్ణయించుకున్నట్టు ఆయన వెల్లడించారు.

ఈ సమావేశంలో కాశ్మీర్‌కు చెందిన మహిళలు తయారు చేసిన త్రివర్ణ పతాకాన్ని సభ్యులందరికీ పంపిణీ చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో ప్రజల ఆలోచనలు మారుతున్నాయని దీనిద్వారా సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. దేశంలోని ప్రతి గ్రామంలో జాతీయ జెండాను ఎగురవేస్తామని హోంమంత్రి అమిత్ షా అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వంలో అత్యధిక సంఖ్యలో గ్రామాలు, గిరిజన ప్రాంతాలు, దళితులు మంత్రులుగా పనిచేశారని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement