భారత ప్రధాని ఎంతో ఆకర్షణీయమైనే రాజకీయ నేతగా వెలుగొందుతున్నారు. అంతేకాదు పలు రికార్డులను కూడా ఆయన ఇప్పటి వరకు సృష్టించారు. ప్రజాధరణ కలిగిన నేతల్లో మొదటిస్థానంలో నిలిచిన ఆయన ఇప్పుడు మరో రికార్డ్ ని క్రియేట్ చేశారు. 2021 సంవత్సరానికి ట్విట్టర్ ప్రకటించిన అత్యంత ప్రభావిశీల వ్యక్తుల్లో ప్రధాని మోడీ రెండో స్థానంలో నిలిచారు. ఈ విషయాన్ని వినియోగదారుల నిఘా కంపెనీ’ బ్రాండ్ వాష్‘ వార్షిక నివేదిక వల్ల వెల్లడించింది. మొత్తం 50 మందితో విడుదల చేసిన ఈ జాబితాలో తొలి స్థానంలో అమెరికన్ సింగర్ టేలర్ స్విఫ్ట్ మొదటి స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో మోడీ, మూడో స్థానంలో సింగర్ కేటీ పెర్రీ, నాలుగో స్థానంలో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, ఐదో స్థానంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ఉన్నారు. అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో భారత మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 35వ స్థానంలో నిలిచాడు.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily