భారత ప్రధాని నరేంద్ర మోదీ వాటికన్ సిటీకి చేరుకున్నారు. మోదీకి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. పోప్ ఫ్రాన్సిస్‌తో భేటీ మర్యాదపూర్వకమేనని తెలిపారు. ఈ సమావేశానికి సంబంధించినంత వరకు ఎలాంటి అజెండా లేదని ఇదివరకే విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ప్రకటించింది. వాటికన్ సిటీని రోమన్ క్యాథలిక్ చర్చికి ప్రధాన కేంద్రంగా భావిస్తారు. జీ20 అత్యున్నత సమావేశంలో పాల్గొనడానికి మోదీతో పాటు కేంద్రమంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్, ఇతర ఉన్నతాధికారులు రోమ్‌కి చేరుకున్నారు. కాగా జీ20 సమ్మిట్ ఇంకా మొదలు కావాల్సి ఉంది. రెండు రోజుల పాటు ఈ శిఖరాగ్ర సదస్సు కొనసాగుతుంది.
కాగా రోమ్ పర్యటనలో భాగంగా మోదీ ఈ రోజే .. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయెల్ మక్రాన్, ఇండోనేషియా ప్రధాన మంత్రి జోకో విడొడొలను కలవనున్నారు. వారిద్దరితో పాటు సింగపూర్ ప్రధానమంత్రి లీ హొసెయిన్ తో కూడా భేటీ కానున్నారు. ఇది ఇంకా షెడ్యూల్ కాలేదు. ఈ సాయంత్రానికి ప్రధాని టెర్మె డి డయోక్లెజియానో పోడియానికి చేరుకుంటారు..జీ 20సదస్సుతో ప్రధాని పలు దేశాల ప్రధానులు..అధ్యక్షులతో భేటీ కానుండటం ప్రాధాన్యతని సంతరించుకుంది.