Saturday, November 23, 2024

నరేంద్ర మోడీ గో బ్యాక్.. ఏఐటీయుసి. రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య

దేశంలోని పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తూ.. ప్రభుత్వ రంగ సంస్థలను బడా పెట్టుబడిదారులకు అమ్ముతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12వ తేదీన రామగుండం రావడాన్ని వ్యతిరేకిస్తూ నరేంద్ర మోడీ గో బ్యాక్ అని ఏఐటీయుసీ జిల్లా సమితి ఆధ్వర్యంలో కమాన్ చౌరస్తా దగ్గర నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు.ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య మాట్లాడుతూ…దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలని బడా పెట్టుబడిదారులకు తాకట్టు పెడుతూ ప్రభుత్వ రంగ సంస్థల వ్యతిరేకి, కార్మిక, కర్షక వ్యతిరేకి అయిన నరేంద్ర మోడీ.. పెట్టుబడుదారుల ముద్దుబిడ్డ నరేంద్ర మోడీ గో బ్యాక్.. నీవు వచ్చేముందు ప్రభుత్వ సంస్థలను ,సింగరేణి ఎన్టీపీసీ ,సంస్థలను ప్రైవేటు చేయను అని, 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కొడులను రద్దుచేసి ,కార్మిక హక్కులను పరిరక్షించాలని ఎలక్ట్రిసిటీ బిల్లు 2022ను రద్దు చేసిన, తర్వాతనే రామగుండం రావాలని లేకుంటే మేం నీ పర్యటనను ఏఐటియుసి జిల్లా సమితి ఆధ్వర్యంలో అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కటిక రెడ్డి, బుచ్చన్న యాదవ్, నగర ప్రధాన కార్యదర్శి నలవాల సదానందం, సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కూన రవి, ఎం హేమంత్, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు జక్కుల ఆగయ్య, సిపిఐ మండల కార్యదర్శి పిల్లి కొమురయ్య,జిల్లా కౌన్సిల్ సభ్యులు రాజమల్లు, నాయకులు కన్నవేణి కుమార్, ఐలయ్య, అనిల్ కుమార్, ఉసుకామల్ల. రాములు, జక్కుల రాములు, కాసేటి రాజు, కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement