Friday, November 22, 2024

నరోదా గామ్ ఊచకోత – 60 మంది నిర్దోషులని హై కోర్టు తీర్పు

గుజరాత్ రాష్ట్రంలో 2002 లో చేలరేగిన అల్లర్ల సమయంలో నరోదా గామ్ కేసులో అరెస్టై జైలు శిక్ష అనుభవించిన గుజరాత్ మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు మాయా కొద్నానీ, బజరంగ్ దళ్‌కు చెందిన బాబు బజరంగి సహా 60 మంది నిందితులను నిర్దోషులుగా అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు ప్రకటించింది. అహ్మదాబాద్‌ నగరంలోలోని నరోదా గామ్‌లో ఇళ్లకు నిప్పుపెట్టి 11 మంది ముస్లింలు మరణానికి వీరు కారణమయ్యారని అప్పట్లో కేసులు మోపి అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసుపై గురువారం తుది విచారణ చేపట్టిన అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు.. వారందరినీ నిర్దోషులుగా ప్రకటించింది.

కాగా, 97 మందిని ఊచకోత కోసిన నరోడా పాటియా అల్లర్ల కేసులో కొద్నానీ దోషిగా నిర్ధారించారు. అనంతరం ఆమెకు 28 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఆ తర్వాత ఆమెను గుజరాత్ హైకోర్టు విడుదల చేసింది. నరోదా గామ్‌లో జరిగిన ఊచకోత 2002లో జరిగిన మతపరమైన అల్లర్లకు సంబంధించిన తొమ్మిది ప్రధాన కేసుల్లో ఒకటి. సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక బృందం దర్యాప్తు చేసింది. నరోదా గామ్ కేసులో 80 మందికి పైగా నిందితులుగా పేర్కొనబడ్డారు. విచారణ సమయంలో 18 మంది చనిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement