Friday, October 18, 2024

Engagement – హీరోయిన్‌ సిరీ లెల్లతో నారా రోహిత్ నిశ్చితార్థం..

కాబోయే జంట‌ను ఆశీర్వ‌దించిన చంద్ర‌బాబు దంప‌తులు

హైద‌రాబాద్ – నటుడు నారా రోహిత్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. ‘ప్రతినిధి 2’ హీరోయిన్‌ సిరీ లెల్లతో ఆయన వివాహం జరగనుంది. ఈ నేప‌థ్యంలో ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో జరిగిన నిశ్చితార్థ వేడుక‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు, ఇరు కుటుంబాల పెద్దలతోపాటు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు చెప్పారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు

.

చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు కుమారుడే రోహిత్‌. ‘బాణం’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. యాక్షన్‌ డ్రామా ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. 2011లో విడుదలైన ‘సోలో’తో తొలి విజయాన్ని సొంతం చేసుకున్నారు. అనంతరం ‘ఒక్కడినే’, ‘ప్రతినిధి’, ‘రౌడీ ఫెలో’, ‘అసుర’, ‘జో అచ్యుతానంద’ వంటి చిత్రాల్లో నటించారు. 2018లో విడుదలైన ‘వీర భోగ వసంత రాయలు’ తర్వాత దాదాపు ఆరేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ ఏడాది ఆయన నటించిన ‘ప్రతినిధి 2’ విడుదలైంది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే నటి సిరీతో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement