ఏపీ సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ రాశారు. పోలవరం నిర్వాసితుల సమస్యను పరిష్కరించాలని లేఖలో కోరారు నారా లోకేష్. ప్రతిపక్ష నేతగా జగన్ పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలలో పర్యటించి కొన్ని హామీలిచ్చారని… ప్రతి ఎకరాకు రూ.19 లక్షలు ఇస్తానని ఓసారి, రూ.10 లక్షలు ఇస్తానని మరోసారి మాట మార్చారని తెలిపారు. భూమి లేని వారికి రూ.10 లక్షలు ప్యాకేజ్ ఇస్తానని, వలస వెళ్లిన వారికి కూడా ప్యాకేజీ అమలు చేస్తామని జగన్ హామీ ఇచ్చారని… జగన్ సీఎం అయినా ఒక్క హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు. నిర్వాసితుల సమస్య చిన్నదంటున్న మంత్రులు.. దాని పరిష్కారానికి చిన్న ప్రయత్నమైనా చేయడం లేదని.. పోలవరం నిర్వాసితులైన 275 గ్రామాలకు గాను 9 గ్రామాల్లో అరకొరగా మాత్రమే పరిహారం అందించారన్నారు. 41.15 మీటర్ల కాంటూరు నిర్వాసితుల పరిహారానికి కేవలం రూ.550 కోట్లే విడుదల చేశారని… అందులోనూ రూ. 100 కోట్లు మింగేయడం చాలా దారుణమన్నారు నారా లోకేష్.
ఇది కూడా చదవండి: అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అల్లు బ్రదర్స్..