Tuesday, November 19, 2024

ఇక 11 రోజులే మిగిలాయి.. ఉరిశిక్ష ఎప్పుడు?

ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన గుంటూరు బీటెక్ విద్యార్థిని హత్య కేసు విషయంలో రాష్ట్రప్రభుత్వానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విధించిన డెడ్ లైన్ దగ్గర పడుతోంది. ఈ కేసులో నిందితుడిని 21 రోజుల్లో శిక్షించాలన్న లోకేశ్.. ప్రతి రోజూ ఆ డెడ్‌లైన్‌ను ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం 21 రోజుల తర్వాత స్పందించకపోతే మళ్లీ పోరాటం చేస్తానంటూ హెచ్చరించారు. చట్టమే లేని చట్టాన్ని చూపించి చట్టముందంటున్నారని విమర్శించారు. ఆ చట్టం ఉన్నది నిజమైతే రమ్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

‘దిశ చట్టంతో ఉరిశిక్ష కూడా వేసేసామని మంత్రులు అంటుంటే పోలీసు ఉన్నతాధికారులు మాత్రం అలాంటి చట్టం ఏమి లేదని అంటున్నారు. 500 ఘటనలు జరిగినా కనీసం ఒక్క ఆడబిడ్డ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం ఇవ్వలేని ముఖ్యమంత్రి.. నష్ట పరిహారం అందించి చేతులు దులుపుకునే ప్రభుత్వ ధోరణి వలనే రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఇక 11 రోజులే మిగిలాయి రమ్యని అంతం చేసిన క్రూరుడికి ఉరి ఎప్పుడు?’ అంటూ నారా లోకేశ్ ప్రశ్నించారు.

ఇది కూడా చదవండిః మంత్రి మల్లారెడ్డి ఇంటిని ముట్టడించిన కాంగ్రెస్ కార్యకర్తలు..

Advertisement

తాజా వార్తలు

Advertisement