ఏపీ సర్కార్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. విశాఖపట్నంలోని మధురవాడ మిథిలాపురి కాలనీలో ఓ విలువైన స్థలం ఖాళీ చేయాలంటూ సిఐడి ఒత్తిడి చేస్తుందని, ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని కార్యాలయానికి పిలిపించుకొని మరీ బెదిరింపులకు దిగుతున్నారని ఆందోళన చెందుతున్నారు కల్లుగీత కార్మికుల కుటుంబాలు. ఇదే విషయంపై ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వం పై టిడిపి జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేష్ మండిపడ్డారు. “జగన్ రెడ్డి పాలనలో సిఐడి పేరు “క్రైమ్ ఇన్వాల్మెంట్ డిపార్ట్మెంట్” గా మార్చేశారు. చివరికి సివిల్ కేసుల సెటిల్మెంట్లు, కబ్జాలకి సిఐడిని అడ్డా చేశారు. సిఐడి పేరు వింటేనే జనం ఛీకొట్టేలా ఉంది తీరు. ఏ నెంబర్ అక్యూజ్డ్ రెడ్డి కళ్లలో ఆనందం కోసం విశాఖ పాత మధురవాడలో కల్లుగీత కార్మికులపై బెదిరింపులకు దిగారో సీఐడీ సమాధానం చెప్పాలి. 20 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేయడానికి సీఐడీని గూండా గ్యాంగుల్లా వాడటం సైకో పాలనలో చూస్తున్నాం. పేద గీతకార్మికులపై ఖాకీకావరం చూపుతోన్న సీఐడీకి దమ్ముంటే దసపల్లా భూములు కబ్జా చేసినోళ్లను పట్టుకోవాలి” అని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు నారా లోకేష్.
Advertisement
తాజా వార్తలు
Advertisement