Friday, November 22, 2024

ఆక్సిజన్ అందక జనాలు చస్తుంటే… ఐపీఎల్ మ్యాచ్‌లు చూసుకుంటున్నావా?- నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా మారుతుంది. కరోనా సమయంలో కూడా అధికార ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక ప్రజల ప్రాణాలు పోతుంటే… తాడేపల్లి నివాసంలో జగన్ రెడ్డి గారు ఐపీఎల్ మ్యాచ్ మిస్ అవ్వకుండా చూస్తున్నారన్నారు. అదే విధంగా విజయనగరం మహారాజా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ఐదుగురు చనిపోవడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు లోకేష్. మృతుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రతిపక్ష పార్టీ గా ప్రతి రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వివరిస్తున్నా… ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదని అన్నారు.ఆసుపత్రుల్లో బెడ్లు,ఆక్సిజన్,మందులు అందక ప్రజలు నరకయాతన పడుతున్నారు.ఇప్పటికైనా జగన్ రెడ్డి గారు పేరాసిట్మాల్,బ్లీచింగ్ కబుర్లు మాని ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్నారు. తాడేపల్లి ప్యాలస్ బయటకి వస్తే వాస్తవాలు తెలుస్తాయి.తక్షణమే బెడ్లు,ఆక్సిజన్,మందులు కొరత లేకుండా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement