సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు సీనియర్ నటుడు మోహన్ బాబు. కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ గానూ బిరుదులు పొందారు. నటనతో ఎంతో మంది అభిమానాన్ని దక్కించుకున్నారు. నేడు ఆయన పుట్టిన రోజు . 1952 మార్చి 19న తిరుపతిలో జన్మించారు మోహన్ బాబు . నేటితో 70వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మంచు వారి కుటుంబ సభ్యుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు అభిమానులు మోహన్ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఈ క్రమంలో మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబుకు ఎమోషనల్ గా విషెస్ తెలపడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల భూమా మౌనికా రెడ్డిని రెండో పెళ్లి చేసుకున్న మనోజ్ తన పెళ్లి సందర్భంలో బాగా వైరల్ అయిన ఫొటోను పంచుకుంటూ తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈఫొటో మోహన్ బాబును పట్టుకొని మౌనికా రెడ్డి కృతఘ్నత భావంతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఆ ఫొటోను షేర్ చేస్తూ.. ‘నడక నుండి నా నడవడిక వరకు నన్ను నడిపించిన నాన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నాన్నా… లవ్ యూ…!’ చాలా ఎమోషనల్ గా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.