రాజస్థాన్‌కు చెందిన 19 ఏళ్ల నందిని గుప్తా మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుంది. మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో జరిగిన అందాల పోటీల్లో ఢిల్లికి చెందిన శ్రేయాపూంజా ఫస్ట్ రన్నరప్‌గా, మణిపూర్‌కు చెందిన తౌనోజామ్ స్ట్రెలా లువాంగ్ రెండవ రన్నరప్‌గా నిలిచారు. మిస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్న నందిని గుప్తా రాజస్థాన్‌లోని కోటాకు చెందిన యువతి. బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పొందిన నందిని గుప్తా చిన్ననాటి నుంచే అనేక ఎక్సట్రాకెరికులర్ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపేది.
వివిధ సంస్థలు నిర్వహించిన ఈవెంట్స్‌లో హోస్టింగ్ కూడా చేసేది. మీడియాతో మాట్లాడుతూ ఆమె వ్యాపారవేత్త, మానవతావాది రతన్ టాటా తనకు స్ఫూర్తి అని వెల్లడించింది. నాణ్యతకు ప్రసిద్ధి చెందిన కోటా ఫాబ్రిక్స్‌కు జాతీయ, అంతర్జాతీయంగా ప్రోత్సాహించడానికి, చేనేత కార్మికులకు సహాయం చేయాలనేది తన ధ్యేయమని ఆమె పేర్కొంది.