హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ కోఠిలోని మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం పేరును వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు తెలంగాణ యూనివర్సిటీ చట్టం 1991లో (యాక్టు 4లో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ యూనివర్సిటీకీ ఇంచార్జీ వీసీగా ఉసకమానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగం సీనియర్ ప్రొఫెసర్ ధరావత్ సూర్యను నియమించారు. కాగా, ఈ విశ్వవిద్యాలయ నిర్వహణకు రూ. కోటి నిధిని మంజూరీ చేసింది.