Wednesday, December 11, 2024

TG | కృష్ణా జలాలతో నల్గొండ సస్యశ్యామలం.. అదే మా లక్ష్యం : సీఎం రేవంత్

ప్రజాపరిపాలన విజయోత్సవాల్లో భాగంగా ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి… జిల్లా కేంద్రంలోని జివి గూడెంలో వైద్య కళాశాల ప్రారంభోత్సవం, నర్సింగ్ కళాశాల శంకుస్థాపన చేశారు. అనంతరం గంధంవారి గూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు.

‘‘తెలంగాణ ఉద్యమంలో నల్గొండ పాత్ర మరువలేదని.. ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకున్న శ్రీంకాంతాచారి నల్గొండ వ్యక్తే అని స్మరించుకున్నారు. నల్గొండలో అడుగుపెట్టినప్పుడల్లా సాయుధ పోరాటం గుర్తొస్తుందని సీఎం రేవంత్ అన్నారు. రజాకార్ల ఆగడాలకు ఎదురొడ్డి నిలిచిన జిల్లా నల్గొండ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

కేసీఆర్ ఎప్పుడైనా ప్రతిపక్ష పాత్ర పోషించారా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగా నల్గొండ జిల్లా అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి ఉంటే.. నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్య పరిష్కారమయ్యేది అన్నారు. కానీ, కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నల్గొండ వాసులకు ఎక్కువ నష్టం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

ఈ జిల్లాలో కృష్ణా జలాలు ప్రవహించేలా చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి దేశానికే మోడల్‌గా తీర్చిదిద్దుతామన్నారు. వరి పండిస్తే ఉరే అని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.500 బోనస్ ఇచ్చి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం అని తెలిపారు.

2.70లక్షల ఎకరాల్లో సన్న వడ్లను నల్గొండ జిల్లా రైతులు పండించారని.. వరి పంటలో నల్గొండ జిల్లా నెంబర్ వన్ అని తెలిపారు. వ్యవసాయం అంటే పండుగ అనేలా తమ ప్రభుత్వం చేస్తోంది” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement