ఖమ్మంలో టీడీపీ జాతీయ అధ్యక్షడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మంత్రులు పువ్వాడ, హరీష్ రావు, శ్రీనివాస గౌడ్, కొప్పుల ఈశ్వర్ లు ద్వజమెత్తారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ హైదరాబాద్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడారు. చంద్రబాబు ఖమ్మం సభలో కుటీల బుద్ధిని కపట నీతిని ప్రదర్శించారు. ఏ మొహం పెట్టుకొని ఖమ్మంలో సభ పెట్టావ్ బాబు, తెలంగాణ ప్రజల బతుకులు ఆగం చేసిన బాబు పచ్చబడ్డ తెలంగాణలో చిచ్చుపెట్టేందుకు మళ్ళీ బయలుదేరాడు అన్నారు. తెలంగాణ ఏర్పడిన తొలి రోజు నుంచి చంద్రబాబు కుట్ర బుద్ధులు బయటపడ్డాయన్నారు. పోలవరానికి ఏడు తెలంగాణ మండలాలను చంద్రబాబు మోడీ మోహర్బానీతో గుంజుకుని ఖమ్మంలో గురువింద గింజల మాట్లాడుతున్నాడు. వ్యవసాయం దండగ అని అన్నోడే తెలంగాణలో ఆ ప్రాజెక్టు కట్టాం ఈ ప్రాజెక్టు కట్టామంటూ కట్టు కథలు చెబుతున్నారు. రైతులను నిర్లక్ష్యం చేసి మేము ఓడిపోయామని 2004 ఓటమి తర్వాత చేసిన ప్రకటన చంద్రబాబు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలన్నారు. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని రైతుల అవమానపరిచిన వాడు నేడు ముసలి కన్నీరు ప్రదర్శిస్తున్నాడు. బషీర్బాగ్ లో కరెంట్ చార్జీలు తగ్గించాలన్న రైతులపై కాల్పులు జరిపించి ముగ్గుని బలిగొన్నది నువ్వు కాదా బాబు అని ప్రశ్నించారు. నీ అవకాశవాద రాజకీయాలు ఏపీలో ప్రదర్శించుకో తెలంగాణలో కాదు అన్నారు. 2018లో మహాకూటమి పేరుతో తెలంగాణలో వసం చేసుకోవాలి కుట్ర పన్నితే ప్రజలు ఏకమై చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పారు.
ప్రజలు ఇచ్చిన తీర్పుకు నాలుగేళ్లయినా కాలేదు మళ్లీ గుంట నక్కల ఖమ్మం నుంచి కుట్రకు తెరలేరు. నక్కజిత్తుల నారా బాబు తెలంగాణలో నీ రుబాబు నడవదు, నువ్వు స్టేట్స్ మాన్ కాదు సేల్స్ మ్యాన్ అని అందరికి తెలుసు అన్నారు. బీజేపీతో ఏపీలో పొత్తుకు తెలంగాణలో నాటకాలు వేస్తున్నావు, ఖమ్మం లాంటి సభలు ఎన్ని పెట్టిన చంద్రబాబు శ్రమ వృధాయే అన్నారు. తెలంగాణలో పడే కష్టమేదో ఏపీలో పడితే నాలుగోట్లైనా పెరుగుతాయి. తెలంగాణలో బాబు కాళ్లకు బల్పం కట్టుకొని తిరిగిన చిల్లుపడ్డ కొండలు నీళ్లు పోసినట్టే తప్ప ఒరిగేది ఏమీ లేదన్నారు. బీజేపీ షర్మిల ప్రయోగం ఫెయిల్ అయిందని బాబును పంపినట్టు అర్థమవుతుంది. ఏపీలో చెల్లని నాణెం బాబు తెలంగాణలో చెల్లుతుందా అన్నారు. రాహుల్ గాంధీతో 2018లో స్నేహం చేశావు, ఎన్నికలు అయిపోగానే మోడీ చెంతన చేరావు, ఓటుకు నోటు మహా కూటమితో తెలంగాణపై బాబు కుట్టరేంటో తెలిసాయి.. ఇప్పుడు ఖమ్మం సభ కూడా అలాంటి కుట్రలో భాగమే అన్నారు. వైయస్ హాయల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఓట్లను కొని ఎమ్మెల్సీ అయిన కాసాని జ్ఞానేశ్వర్ కు ఎమ్మెల్యేలను కొని కేసీఆర్ ప్రభుత్వాన్ని పడకొడదామనుకున్న దొరికిపోయిన బాబు టీడీపీ అధ్యక్షుడును చేశారు. కాసానితో తెలంగాణను పొడిపిస్తున్న కసాయి చంద్రబాబు అన్నారు. చంద్రబాబుతో ఊదు కాలదు పీరు లేవదు. ఎన్నో ఏళ్లుగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు మరి అమరావతిని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు హైదరాబాద్ పై ఇవే మాయ మాటలు చెబితే 2004లో టిడిపిని ఓడించారు.. అమరావతిపై 2019లో బడాయి మాటలు చెబితే బండకేసి కొట్టారు. ఐటీ బాబు డెవలప్ చేశారా.. మొన్న అర్జెంటీనా ప్రపంచకప్ గెలవడానికి తానే కారణమని బాబు అన్నా అంటారు.