కర్ణాటకలో అమానవీయ ఘటన జరిగింది. ఓ మహిళను కొందరు నగ్నంగా ఊరేగించారు. కరెంట్ పోల్కు కట్టి దాడి చేశారు. ఆమె కుమారుడు, ఆ యువతితో వెళ్లిపోవడమే ఇందుకు కారణం!
ఇదీ జరిగింది.
.కర్ణాటక బెళగావి జిల్లాలోని న్యూ వంటమూరి గ్రామంలో జరిగింది ఈ ఘటన. గ్రామంలో నివాసముంటున్న 24ఏళ్ల అశోక్, 18ఏళ్ల ప్రియాంక.. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా.. యువతికి వేరే వ్యక్తితో పెళ్లి ఫిక్స్ అయ్యింది. నిశ్చితార్థానికి కొన్ని రోజుల ముందు.. ఆదివారం అర్థరాత్రి 12:30 గంటల సమయంలో.. ప్రేమికులు ఇద్దరు గ్రామాన్ని విడిచి వెళ్లిపోయారు.
ఈ విషయం తెలుసుకున్న ప్రియాంక కుటుంబసభ్యులు.. రాత్రికి రాత్రే.. అశోక్ ఇంటిపై దాడి చేశారు. ఇంటిని ధ్వంసం చేశారు. అతని తల్లిని దారుణంగా కొట్టారు. అంతేకాకుండా.. ఆమెను నగ్నంగా చేసి, గ్రామంలో ఊరేగించారు. చివరికి.. ఓ కరెంట్ స్తంభానికి కట్టి, కొట్టారు
ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందింది. వెంటనే స్పందించిన పోలీసులు.. ఘటనాస్థలానికి పరుగులు తీశారు. కరెంట్ స్తంభానికి కట్టేసి ఉన్న మహిళను వెంటనే విడిపించారు. ఆ వెంటనే.. ఘటనతో సంబంధం ఉన్న ఏడుగురిని అప్పటికప్పుడు అరెస్ట్ చేశారు