Tuesday, November 26, 2024

ఇంకా హాస్పటల్ లోనే నాగశౌర్య.. పెళ్లి టైంకి కోలుకుంటాడా..

నవంబర్ 20న యంగ్ హీరో నాగశౌర్య పెళ్లి పీటలెక్కనున్నారు.కాగా సోమవారం ఓ సినిమా షూటింగ్ లో పాల్గొనగా.. చిత్రీకరణ సమయంలో ఆయన కళ్లు తిరిగి పడిపోయారు. చికిత్స కోసం వెంటనే దగ్గరలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అయితే నాగ శౌర్య ఇంకా హాస్పిటల్ లోనే ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకొంటున్నారు. అతని ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉందని.. త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.శౌర్య తన కొత్త సినిమాలో పాత్ర కోసం తీవ్రంగా వర్కౌట్స్ చేస్తూ పర్ఫెక్ట్ బాడీని రెడీ చేస్తున్నాడు. ఇందులో కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో సిక్స్ ప్యాక్ బాడీని చూపించాల్సి ఉండగా.. సోమవారం షూటింగ్ లో వాటిని ప్లాన్ చేశారట. దీని కోసం గత మూడు నాలుగు రోజులుగా లాలాజలం మాత్రమే మింగుతూ కనీసం నీళ్లు కూడా తీసుకోలేదట.దీంతో నాగశౌర్య సెట్ కి వచ్చినప్పుడే కాస్త అలసటగా కనిపించారట. ఈ క్రమంలోనే యాక్షన్ సీన్ షూట్ చేయాల్సిన సమయంలో కళ్లు తిరిగి పడిపోయారని.. హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారని సన్నిహితులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement