Friday, November 22, 2024

సాగర్‌కు భారీగా వరద.. నేడు తెరుచుకోనున్న డ్యామ్ గేట్లు

ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న వరద నీటితో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. శ్రీశైలం జలాశయం నుంచి భారీగా వస్తున్న వరద నీటితో సాగర్‌ జలకళను సంతరించుకుంది. ఆదివారం సాయంత్రం వరకు ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిస్థాయిలోకి చేరుకునే అవకాశం ఉండడంతో క్రస్ట్‌ గేట్లు ఎత్తివేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు గేట్లను ఎన్‌ఎన్‌పీ అధికారులు క్రస్ట్‌ గేట్లను పరిశీలించారు.

సాయంత్రం 6 గంటలకు గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు సీఈ శ్రీకాంతరావు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 4,80,222 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. ప్రస్తుతం ఔట్‌ఫ్లో 37,743 క్యూసెక్కులుగా ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను.. ప్రస్తుతం 579.20 అడుగులకు చేరింది. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు. ప్రస్తుతం డ్యామ్‌లో 280.69 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ఈ వార్త కూడా చదవండి: మనిషి కాళ్లను చుట్టేసిన పాము.. కొట్టి కొట్టి చంపిన వ్యక్తి

Advertisement

తాజా వార్తలు

Advertisement