Monday, November 25, 2024

కరోనా హాట్‌స్పాట్‌గా నాగార్జునసాగర్

ఇటీవల ఉపఎన్నిక జరిగిన నాగార్జునసాగర్ నియోజకవర్గం కరోనా హాట్‌‌‌‌స్పాట్‌‌‌‌గా మారింది. ఇక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనేక మంది నేతలకు కరోనా సోకింది. వాళ్ల ద్వారా జనాలకు వ్యాపించింది. గత నెల 1 నుంచి ఏప్రిల్ ​18 వరకు నల్గొండ జిల్లాలో 4,164 పాజిటివ్​ కేసులు వచ్చాయి. వీటిలో సాగర్ ఏరియా ఆస్పత్రిలోనే వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ ఇవాళ సూర్యాపేటకు రానున్నారు.

ఇప్పటికే టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్, ఆయన కుటుంబ సభ్యులకు పాజిటివ్ రావడంతో ప్రస్తుతం వారంతా హైదరాబాద్‌‌‌‌లో హోం ఐసోలేషన్‌‌‌‌లో ఉన్నారు. వీళ్లతో పాటు పార్టీ లీడర్లు ఎంసీ కోటిరెడ్డి, కడారి అంజయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్​రెడ్డి, ఆయన భార్య నివేదితరెడ్డి, కాంగ్రెస్ లీడర్, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయం తెలియడంతో ఉప ఎన్నికల్లో ప్రచారం చేసిన నేతలంతా అలర్ట్​ అయ్యారు. రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాల నుంచి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర స్థాయి నేతలు, క్యాడర్ కరోనా నిబంధనలు మర్చిపోయి, రోజుల తరబడి ప్రచారం చేయడంతో వారంతా ఇప్పుడు కరోనా భయంతో టెస్టులకు పోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement