అక్కినేని నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’ మూవీ విడుదలకు ముందే ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. దీంతో అక్కినేని అభిమానులు, చిత్ర బృందం సభ్యులు షాక్‌లో ఉన్నారు. శుక్రవారం విడుదల కావాల్సిన ఈ మూవీ కొన్ని గంటలకు ముందే ఇంటర్నెట్లో కనిపించడంతో మూవీ మేకర్స్ తలలు పట్టుకుంటున్నారు. పైరసీని ప్రోత్సహించే సైట్లలో ఒకటైన మూవీ రూల్జ్‌లో ‘వైల్డ్ డాగ్’ ఫుల్ మూవీ దర్శనమిచ్చింది. దీంతో అక్కినేని అభిమానుల్లో ఒకరు దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లను ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ.. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థ దీనిని రీట్వీట్ చేస్తూ.. తమ మూవీ అధికారిక ఈ-మెయిల్‌కు రిపోర్ట్ చేయమని సదరు నెటిజన్‌కు సూచించింది. దయచేసి పైరసీ లింకులను [email protected] #wilddogకు అందించాలని కోరింది.
కాగా‘వైల్డ్ డాగ్’ మూవీ ఫుల్ మూవీ లీక్ అయినట్లు వచ్చిన వార్త టాలీవుడ్లో పెను సంచలనం అవుతోంది. అయితే సదరు వెబ్‌సైట్‌ను చూసి అందులో ఆ సినిమా లింక్ లేదని చాలామంది అభిమానులు చెబుతున్నారు. ఇది ఏప్రిల్ ఫూల్స్ చేయడానికి ప్లే చేసిన ట్రిక్ అని కొందరు అంటుంటే.. సినిమా ప్రమోషన్లో భాగంగా చేసిందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.