గుంటూరు (ఏఎన్యూ క్యాంపస్) ప్రభ న్యూస్ : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన (క్యాలెండర్ ఇయర్ 20 21 బ్యాచ్) పీజీ జర్నలిజం, పొలిటికల్ సైన్స్, ఇంగ్లీష్, తెలుగు, ఎకనామిక్స్, హిస్టరీ ,సోషల్ వర్క్, హిందీ, సంస్కృతం, సోషియాలజీ, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఎంకామ్, ఎంఎల్‌ఐ ఎస్‌సి, బిఎల్‌ఐ ఎస్‌సి కోర్సుల పరీక్ష ఫలితాలను బుధవారం అదనపు ఉపకులపతి ఆచార్య రాజశేఖర్ విడుదల చేశారు.
విద్యార్థులు రీవాల్యుయేషన్ దరఖాస్తుకు జూలై ఏడవ తేదీని గడువుగా నిర్ణయించామని, ఒక్కొక్క పేపర్‌లో రీవాల్యుయేషన్ ఫీజుగా రూ. 960 రూపాయలు చెల్లించాలని, పూర్తి చేసిన రీ వాల్యుయేషన్ దరఖాస్తులను జూలై 9 వ తేదీ లోపు విశ్వవిద్యాలయంలోనూ దూరవిద్య పరీక్షల సమన్వయకర్త కు అందజేయాలని డిప్యూటీ- రిజిస్ట్రార్ర్ నంబూరు యోబు ఒక ప్రకటనలో తెలిపారు.
ఫలితాలను ఏఎన్‌యు సిడిఈ డాట్ ఇన్ఫో నుంచి తెలుసుకోవచ్చని ఆయన సూచించారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో దూర విద్య సంచాలకులు నాగరాజు, పరీక్షల సమన్వయకర్త సోమశేఖర్, ఓఎస్‌డి సునీత, సిడిసి డీన్ మధు బాబు, ర్యాంకుల సమన్వయకర్త నాగ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.