ఏఎన్యూ క్యాంపస్, ( ప్రభ న్యూస్): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఈ ఏప్రిల్ లో నిర్వహించిన డిగ్రీ మూడవ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. అదనపు ఉప కులపతి ఆచార్య రాజశేఖర్ ఈ ఫలితాలను విడుదల చేశారు. పరీక్షలకు మొత్తం 33 169 మంది విద్యార్థులు హాజరుకాగా, 18 243 మంది ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థులు ఫలితాలను ఏఎన్యూ డాట్ ఏసి డాట్ ఇన్ అంతర్జాలం నుంచి తెలుసుకోవచ్చని ఏ సి ఈ . ఆర్. ప్రకాష్ రావు తెలిపారు. రీవాల్యుయేషన్, పర్సనల్ వెరిఫికేషన్, జవాబు పత్రం జిరాక్స్ కాపీ కోసం దరఖాస్తుకు ఈ నెల 16 గడువుగా నిర్ణయించామని ఆయన చెప్పారు. విద్యార్థులు రీవాల్యుయేషన్ దరఖాస్తులను వారివారి కళాశాలల్లో ప్రిన్సిపల్స్ కు సమర్పించాలని సూచించారు.
విద్యార్థులు పర్సనల్ లోన్ వెరిఫికేషన్ దరఖాస్తులు పైన వారివారి కళాశాలల ప్రిన్సిపాల్స్ చేత సంతకం చేయించి విశ్వవిద్యాలయంలోని యుజి పరీక్షల సమన్వయకర్త ఆఫీసులో సమర్పించాలని వివరించారు. అలాగే జవాబు పత్రం జిరాక్స్ కాపీ కోసం విద్యార్థులు దరఖాస్తు మీద వారి వారి కళాశాల ల ప్రిన్సిపాల్ చేత సంతకం చేయించి విశ్వవిద్యాలయంలోని యూజీ పరీక్షల సమన్వయకర్త కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. విద్యార్థులు సమర్పించిన రీవాల్యుయేషన్ దరఖాస్తులను ఆయా కళాశాలలు ఈ నెల 19 లోపు విశ్వవిద్యాలయంలోని పరీక్షల సమన్వయకర్త కార్యాలయంలో సమర్పించాలన్నారు.
ఇక.. రీవాల్యుయేషన్ కు సంబంధించి బీసీ ఏ విద్యార్థులు మినహా మిగతా కోర్సుల విద్యార్థులు ఒక్కొక్క పేపర్ కు రూ. 980, బి సి ఎ విద్యార్థులు ఒక్కొక్క పేపర్ కు రూ. 1360, పర్సనల్ వెరిఫికేషన్, జవాబు పత్రం జిరాక్స్ కాపీ కోసం ఒక్కొక్క దానికి పదమూడు వందల అరవై రూపాయలు చెల్లించాలని ప్రకాశరావు పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.