Saturday, November 23, 2024

వారం రోజుల్లో పూర్తిస్థాయిలో నిండనున్న నాగార్జున సాగర్‌, ఎగువన శ్రీశైలానికి వరదపోటు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నాగార్జున సాగర్‌ రిజర్వాయర్‌లో నీటి మట్టం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యానికి అత్యంత చేరువలో ఉంది. రాగల వారం రోజుల్లో సాగర్‌ పూర్తిస్థాయిలో నిండనుంది. మరో 44 టీఎంసీల నీరు వచ్చి చేరితే ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకోనుంది. సాగర్‌ గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 315 టీంఎసీలు కాగా ప్రస్తుతం 268 టీఎంసీల వరద వచ్చింది. ప్రస్తుతం డ్యాంకు ఎగువ నుంచి 70, 359 క్యూసెక్కుల వరద వస్తోంది. రాగల రెండు రోజులపాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో , ఎగువన శ్రీ శైలం ప్రాజెక్టు నుంచి విడుదల చేసే వరదతో వారం రోజుల్లో సాగర్‌ పూర్తిస్థాయిలో నిండనుంది. కాగా… శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి 1, 38, 436 క్యూసెక్కుల వరద వస్తోంది. తుంగభద్ర నుంచి 1, 26, 771 క్యూసెక్కులు, అలమట్టి, నారాయణపూర్‌ల నుంచి 70వేల క్యూసెక్కుల చొప్పున వరద వస్తోంది. ఈ నేపథ్యంలో వారం లోపు సాగర్‌లోకి 44 టీంఎసీల నీరు వచ్చి చేరనుంది. గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖ ం పడుతోంది. శ్రీరాంసాగర్‌కు 42570 క్యూసెక్కుల వరద వస్తుండగా… కడెం ప్రాజెక్టుకు 20, 886 క్యూసెక్కుల వరద వస్తోంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement